బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 30, 2020 , 23:12:18

ఆరోగ్యమే మహా భాగ్యం

ఆరోగ్యమే  మహా భాగ్యం

  •  l  5లక్షల ఇమ్యూనిటీ బూస్టర్‌ కిట్ల పంపిణీ
  • l   జాగ్రత్తగా ఉంటూ   జీవనం గడుపాలంటున్న ఎంపీ,ఎమ్మెల్యేలు

పెద్దశంకరంపేట :  కరోనా వైరస్‌ పట్ల  అప్రమత్తంగా ఉండాలని  ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. గురువారం పెద్దశంకరంపేట మండలపరిషత్‌ కార్యాలయంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులకు హోమియోపతి కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం కట్టుబడి ఉందని,  ఆరోగ్యం కోసం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. పార్లమెంట్‌  పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పంచాయతీల వారీగా సుమారు 5లక్షల ఇమ్యూనిటీ బూస్టర్ల కిట్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ఒక్క కిట్టు 5 మందికి సరిపోతుందని, సుమారు 25 లక్షల మందికి సరిపడా  కిట్లను పంపిణీ చేస్తున్నామన్నారు.   కరోనా వైరస్‌ నివారణకు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు.  

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

రైతును రాజును చేయడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే మహారెడి ్డభూపాల్‌రెడ్డి అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో రూ.20 లక్షలతో కొనసాగుతున్న రైతువేదిక భవన నిర్మాణ పనులను పరిశీలించారు.   ఈ  కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్‌, జడ్పీటీసీ విజయరామరాజు, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఆసూరి మరళీపంతులు,  రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సురేశ్‌గౌడ్‌,  సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కుంట్ల రాములు, సర్పంచ్‌లు శంకర్‌గౌడ్‌, సూర్యప్రకాశ్‌, ఎంపీటీసీ దత్తు, స్వప్న రాజేశ్వర్‌, నాయకులు మానిక్‌రెడ్డి, తహసీల్దార్‌ మనోహర్‌ చక్రవర్తి తదితరులున్నారు.


logo