గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 30, 2020 , 00:33:08

పైరవీలకు ఆస్కారం ఉండదు

 పైరవీలకు ఆస్కారం ఉండదు

  • ఇండ్లులేని  పేదలే ‘డబుల్‌' బెడ్రూంకు దరఖాస్తు చేసుకోవాలి  l  తూప్రాన్‌లో  ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి  

తూప్రాన్‌ రూరల్‌ : తూప్రాన్‌ మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డుల్లోని అర్హులైన ఇండ్లులేని నిరుపేదలు మాత్రమే డబుల్‌ బెడ్రూం ఇండ్లకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ) చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి పట్టణ ప్రజలకు సూచించారు. పట్టణంలోని 500 డబుల్‌ బెడ్రూం ఇండ్లను అర్హులైన నిరుపేదలకే కేటాయిస్తామని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపడుతామని, ఎలాంటి పైరవీలకు ఆస్కారం ఉండబోదన్నారు. ‘గడా’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాఘవేందర్‌గౌడ్‌, కమిషనర్‌ ఖాజామోజియొద్దీన్‌, తహసీల్దార్‌ శ్రీదేవి, జడ్పీటీసీ సత్యనారాయణగౌడ్‌తో కలిసి బుధవారం సాయంత్రం తూప్రాన్‌లో డబుల్‌ బెడ్రూం ఇండ్ల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లను ఆయన పరిశీలించారు. డబుల్‌ బెడ్రూం ఇండ్లకు సంబంధించిన దరఖాస్తు పత్రాలను,దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానాన్ని ఆయన నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొంత ఇండ్లు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవద్దని, ఎన్ని పైరవీలు చేసినా వారి సమయం వృథా అవుతుందన్నారు. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఇండ్లులేని నిరుపేదలను ఆదుకోవాలన్నాదే సీఎం కేసీఆర్‌ ఆశయమన్నారు.

సకల హంగులు, ఆధునిక పద్ధతుల్లో మున్సిపల్‌ భవన నిర్మాణం..

అనంతరం రూ.7.5 కోట్లతో నిర్మిస్తున్న మున్సిపల్‌ కార్యాలయ నూతన భవన నిర్మాణ  పనులను ఆయన పరిశీలించారు. సకల హంగులు, ఆధునిక తరహాలో మున్సిపల్‌ భవన కార్యాలయం ఉండాలని పీఆర్‌ ఇంజినీరింగ్‌ అధికారులను ఆయన ఆదేశించారు. మున్సిపల్‌ చైర్మన్‌, కమిషనర్‌,వివిధ శాఖాధికారులు కూర్చునేందుకు వీలుగా,కౌన్సిల్‌ సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు హాళ్లను,పార్కింగ్‌ సౌకర్యార్ధం నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో  వైస్‌ చైర్మన్‌ నందాల శ్రీనివాస్‌, పట్టణ కౌన్సిలర్లు మామిడి వెంకటేశ్‌, సత్యలింగం, భగవాన్‌రెడ్డి, దుర్గారెడ్డి, మామిండ్ల జ్యోతికృష్ణతో పాటు టీఆర్‌ఎస్‌ నాయకులు ఎక్కలదేవ్‌ వెంకటేశ్‌, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు


logo