మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 28, 2020 , 22:57:54

ఇంటింటికీ భగీరథ నీళ్లు

ఇంటింటికీ భగీరథ నీళ్లు

అక్కన్నపేట : మిషన్‌ భగీరథలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన గోదా వరి జలాలను అందజేస్తామని ఎంపీపీ మాలోతు లక్ష్మి అన్నారు. మంగళవారం అక్కన్నపేటలో మిషన్‌ భగీరథ పనులను అధికారుల తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా  మిషన్‌ భగీరథ పథకం లోని సమస్యలను అధికారులు, ఎంపీపీకి సర్పంచ్‌ సంజీవరెడ్డి వి వరించారు. పలు వార్డుల్లో నీళ్లు రావడం లేదని, గేట్‌ వాల్స్‌, పైపుల లీకేజీ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మిషన్‌ భగీరథ అధి కారులను ఎంపీపీ ఆదేశించారు. కార్యక్రమంలో మిషన్‌ భగీరథ డీఈఈ తసీం, ఏఈ మౌనిక, ఎంపీటీసీ సాంబరాజు, ఉపసర్పంచ్‌ రాధారవీందర్‌, మాజీ జడ్పీటీసీ బీలునాయక్‌ పాల్గొన్నారు.  


logo