సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 28, 2020 , 22:57:55

ప్రశాంతంగా బక్రీద్‌ జరుపుకోవాలి

ప్రశాంతంగా బక్రీద్‌ జరుపుకోవాలి

  •  శాంతి సమావేశంలో ఏసీపీ రామేశ్వర్‌ 

సిద్దిపేట టౌన్‌ : మత సామరస్యానికి ప్రతీక సిద్దిపేట అని.. భిన్నత్వంలో ఏకత్వంగా పట్టణం విరాజిల్లుతుందని ఏసీపీ రామేశ్వర్‌ అన్నారు. బక్రీద్‌ను పురస్కరించుకొని ఏసీపీ కార్యాలయ ఆవరణలో శాంతి కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో బక్రీద్‌ను జరుపుకోవాలని సూచించారు. ప్రభుత్వం గోవధను నిషేధించిందని, అక్రమంగా గోవులను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని మతాలను గౌరవిస్తూ మతసామరస్యానికి పాటుపడాలని సూచిం చారు. బక్రీద్‌కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. పుకార్లు, వదంతులను నమ్మొద్దని, సోషల్‌ మీడియాలో ఫేక్‌ వార్తలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఏదైనా సమస్య ఉత్పన్నమైతే స్థానిక పోలీస్‌స్టేషన్‌, కమిషనరేట్‌ వాట్సాప్‌ నం బర్‌ 7901100100 లేదా 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. ముం దుగా మత పెద్దల నుంచి సూచనలు, సలహాలను తీసుకున్నారు. కార్యక్రమంలో వన్‌టౌన్‌ సీఐ సైదులు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అక్తర్‌పటేల్‌, తంజీమ్‌ అధ్యక్షుడు గౌస్‌మొయినుద్ద్దీన్‌, కౌన్సిలర్‌ జావీద్‌, మత పెద్దలు సజ్జు, యూసుఫ్‌, అత్తు, ఇస్తాయిల్‌ తదితరులు ఉన్నారు. 

గోవులు రవాణా చేస్తే కఠిన చర్యలు

చేర్యాల : గోవులను అక్రమంగా రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ మహేందర్‌ హెచ్చరించారు. మండలంలోని గుర్జకుంట చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును సీఐ శ్రీనివాస్‌రెడ్డి తో కలిసి ఏసీపీ తనిఖీ చేశారు. అనంతరం గుర్జకుంటలో భూ విషయం పై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో ప్రత్యక్ష, పరోక్ష సాక్ష్యులను విచారిం చారు. గోవులను అక్రమంగా రవాణా చేయకుండా చెక్‌పోస్టు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కేసులను పారదర్శకంగా విచారణ చేస్తు న్నట్లు చెప్పారు. వారి వెంట ఎస్సై మోహన్‌బాబు, సిబ్బంది ఉన్నారు.


logo