ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 28, 2020 , 02:28:40

‘మల్లన్న’ ఉద్యోగులకు మెమోలు జారీ

‘మల్లన్న’ ఉద్యోగులకు మెమోలు జారీ

చేర్యాల : కొమురవెల్లి మల్లన్న ఆలయంలో మొక్కుబడి కోడెలు, గొర్రెలు, మేకల మాయమవుతున్న ఘటనపై సోమవారం మన ‘నమస్తే తెలంగాణ’లో ‘మల్లన్న మన్నించూ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్‌ స్పందించారు. మొక్కుబడి కోడెలు, మేకలు, గొర్రెల సంరక్షణ విభాగ ఇన్‌చార్జి మేకల పోచయ్య, వెంకటాచారికి ఆలయ ఈవో మెమోలు జారీ చేశారు. ఇరువురి ఉద్యోగుల్లో మేకల పోచయ్య ఎక్కువ కాలం, వెంకటాచారి కొద్దికాలం విధులు నిర్వహించినట్లు ఈవో తెలిపారు. వారి సమాధాన అనంతరం శాఖా పర చర్యలు తీసుకుంటామన్నారు.

కోడెల కేసులో మరొకరి అరెస్ట్‌

మల్లన్న కోడెలను అక్రమంగా అమ్ముతున్న ఇద్దరిని ఇది వరకే అరెస్ట్‌ చేసిన కోర్టులో హాజరు పరిచిన పోలీసులు, సోమవారం మొక్కుబడి కోడెను కొనుగోలు చేసిన కొమురవెల్లికి చెందిన చిక్కుడు రాములును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు కొమురవెల్లి ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి తెలిపారు.

నేడు మల్లన్న ఆలయంలో వేలం పాటలు

చేర్యాల : మల్లన్న ఆలయంలో నేడు(మంగళవారం) పసుపు బియ్యం, మేకలు, గొర్రెలు, పాత ఇనుప సామగ్రి బహిరంగ వే లం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో టం కశాల వెంకటేశ్‌ తెలిపారు. బహిరంగ వేలం లో పాల్గొనే పాటదారులు ఆలయం నిర్ణయించిన అంశాల వారీగా రూ.10వేలు డి పాజిట్‌ చెల్లించి పాటలో పాల్గొనాలని సూ చించారు. వేలం పాటల్లో హెచ్చుపాటదారు డు పాట మొత్తం సొమ్మును పాట ముగిసిన వెంటనే చెల్లించాలని సూచించారు. సమావేశంలో ఏఈవో శ్రీనివాస్‌, ప్రధానార్చకుడు మహదేవుని మల్లికార్జున్‌ తదితరులున్నారు.

logo