సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 26, 2020 , 02:02:50

నూతన మున్సిపాలిటీ భవన నిర్మాణానికి నిధులు

నూతన మున్సిపాలిటీ  భవన నిర్మాణానికి నిధులు

  • ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

చేర్యాల : మున్సిపాలిటీల అభివృద్ధి  ప్రభుత్వం కృషి చేస్తోందని, చేర్యాల మున్సిపల్‌ భవన నిర్మాణానికి త్వరలో నిధులు విడుదల చేయనున్నదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. శనివారం మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులకు ప్రభుత్వం రూ.12వేల వేతనం  అందించనున్నదన్నారు. మున్సిపల్‌ చట్ట ప్రకారం 60 సంవత్సరాల పైబడిన కార్మికులను తొలిగించనున్నట్లు తెలిపారు. తొలిగించిన కార్మికుల కుటుంబ సభ్యులు లేదా వారి సూచించిన వారిని తిరిగి విధుల్లో తీసుకుంటామన్నారు. గతంలో సిబ్బంది నియామకం పద్ధతి ప్రకారం జరుగలేదని, ప్రస్తుతం మున్సిపల్‌ చట్టపరిధిలో సిబ్బంది నియామకం ఉంటుందన్నారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా విస్తృతంగా మొక్కలు నాటిన పార్టీ శ్రేణులతో పాటు నూతనంగా ఎన్నికైన కో-ఆప్షన్‌ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ అంకుగారి స్వరూపరాణి, ఇన్‌చార్జి కమిషనర్‌ రామలక్ష్మి, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ గుజ్జ సంపత్‌రెడ్డి, రిటైర్డ్‌ ఈఈ ముస్త్యాల బాల్‌నర్సయ్య, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కో-ఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు.logo