గురువారం 01 అక్టోబర్ 2020
Siddipet - Jul 26, 2020 , 00:07:20

శుభకార్యాల వేళ.. నేటి నుంచి పెండ్లిళ్లకు శుభ ముహూర్తాలు

శుభకార్యాల వేళ.. నేటి నుంచి పెండ్లిళ్లకు శుభ ముహూర్తాలు

  • m లాక్‌డౌన్‌తో ఆగిన వివాహాల \ నిర్వహణకు సిద్ధం
  • m శ్రావణంలో 3000 పైగా  పెండ్లిళ్లు జరిగే అవకాశం
  • m ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి
  • m కరోనాతో తగ్గిన ఖర్చు

మెదక్‌ అర్బన్‌/ సంగారెడ్డి టౌన్‌: కరోనా ప్రభావం పెండ్లిళ్లపై కూడా పడింది. ముహూర్తాలు పెట్టుకున్నవారు ఆరు నెలలుగా పెండ్లిని వాయిదా వేసుకుంటున్నారు. మార్చి 22 తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో జిల్లాలో ఇప్పటికే జరుగాల్సిన పెండ్లిళ్లు వాయిదాపడ్డాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తివేయడం, రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలతో శ్రావణ మాసంలో ప్రజలు పెండ్లి వేడుకలు జరుపుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ మాసంలో ఉమ్మడి జిల్లాలో సుమారు 3000లకు పైగా పెండ్లిళ్లు జరిగే అవకాశం ఉన్నదని, 26కు పైగా ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. దీంతో పెండ్లివారు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

వివాహాలకు తగ్గిన ఖర్చు..

కరోనా ప్రభావం రోజురోజుకూ పెరుగుతుండటంతో పెండ్లిళ్లు జరుపుకునే వారు. వధువు, వరుడు ఇరువురి తరఫున 20 మందితో ఈ శుభకార్యం జరుపుకోవచ్చనే అనుమతిని ప్రభుత్వం ఇవ్వడంతో, ప్రస్తుతం జరిగే వివాహాలకు ఖర్చు చాలా వరకు తగ్గింది. చాలామంది వివాహాలు కూడా ఖర్చు తక్కువగా అవుతుందని కరోనా సమయంలోనే జరిపిస్తున్నారు.

పెండ్లిళ్లకు అనుమతి తప్పనిసరి..

శ్రావణమాసం శుభసూచికంలో నూతనంగా పెండ్లిళ్లు చేసుకుంటారు. ఈ మాసంలో అధికంగా పెండ్లి ముహూర్తాలు ఉన్నట్లు బ్రాహ్మణులు తెలిపారు. కాగా, ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృభిస్తున్న తరుణంలో పెండ్లిళ్లు చేసుకునేందుకు తప్పనిసరిగా తహసీల్దార్ల అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా కోర్టు నుంచి జ్యుడీషియల్‌ స్టాంపు పేపర్‌పై అనుమతి తీసుకోవాలనే నిబంధన విధించారు. పెండ్లికి వధువు తరఫున 10 మంది, వరుడి తరఫున 10 మంది మొత్తం 20 మందితోనే పెళ్లి వేడుక చేసుకోవాలని సూచించారు. పెద్ద మొత్తంలో గుమిగూడితే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

శ్రావణంలో ముహూర్తాలు..

శ్రావణ మాసం ఈనెల 21 నుంచి ఆగస్టు 19 వరకు ఉంటుంది. ఈ మాసంలో 26 వరకు వివాహ ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఇందులో ఈ నెల 26న రెండు, 29న రెండు, 30, 31న మూడు, ఆగస్టు 2న రెండు, 5, 6, 7, 8, 9న మూడు చొప్పున, 10, 14వ తేదీల్లో నాలుగు చొప్పున మొత్తం 26 ముహూర్తాలు ఉన్నాయి. దీంతో పాటు గృహప్రవేశాలకు కూడా మంచి రోజులు ఉండటంతో ప్రజలు ఈ ముహూర్తాలలో శుభకార్యాలు జరుపుకొనేందుకు సిద్ధమవుతున్నారు.

నిబంధనలు పాటిస్తూ కార్యాలు చేసుకోవాలి..

లాక్‌డౌన్‌ విధించడంతో చాలా మంది వివాహాలు వాయిదా వేసుకున్నారు. ఈ శ్రావణ మాసంలో 26 వరకు మహూర్తాలు ఉండటంతో వాయిదా వేసుకున్న పెండ్లిళ్లు ఇప్పుడు జరిపిస్తున్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటిస్తూ శుభకార్యాలు నిర్వహించుకోవాలి.

- వేద పండితులు, వేద్య శ్రీనివాస్‌శర్మ


తాజావార్తలు


logo