శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 25, 2020 , 01:28:07

నందనవనాలుగా పల్లెలను తీర్చిదిద్దాలి

నందనవనాలుగా పల్లెలను తీర్చిదిద్దాలి

  •  అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు  
  •  టెలీ కాన్ఫరెన్స్‌లో మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి

మెదక్‌ : ఆయా గ్రామాల్లో శ్మశానవాటికలు, రైతు వేదికలు, కల్లాలు, డంపింగ్‌ యార్డులు ఏఏ స్థాయిలో ఉన్నాయి.. పనుల విషయంలో అధికారులు  నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్య లు తప్పవని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని డీఎల్‌పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేసి, నందనవనాలుగా తీర్చిదిద్దాలని తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి హనోక్‌, తూప్రాన్‌ డీఎల్‌పీవో లక్ష్మితో ఫోన్‌లో మాట్లాడిన కలెక్టర్‌, పనుల పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.  మెదక్‌ను ఓడీఎఫ్‌ జిల్లాగా మార్చేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గ్రామా లు, పట్టణాల్లో అవసరమైన ఇంకుడు గుంతలు నిర్మించడంతో పాటు వంద కుటుంబాలకు కమ్యూనిటీ టాయిలెట్లను ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను  కలెక్టర్‌ ఆదేశించారు. గ్రామాల్లో ప్రతి నెలా కరెంట్‌ బిల్లులను తప్పకుండా చెల్లించాలని, విద్యుత్‌ పొదుపునకు అవసరమైన చోట ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని, పని చేయని బోర్ల కనెక్షన్లను తొలిగించాలని సూచించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీవో పీడీ శ్రీనివాస్‌ అధికారులు పాల్గొన్నారు.


logo