మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 24, 2020 , 01:20:55

మంత్రి కేటీఆర్‌ బర్త్‌డే కానుకగా1.25 లక్షల ప్లాంటేషన్‌

 మంత్రి కేటీఆర్‌ బర్త్‌డే కానుకగా1.25 లక్షల ప్లాంటేషన్‌

చేర్యాల : టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ,మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ బర్త్‌డే సందర్భంగా శుక్రవారం జనగామ నియోజకవర్గంలోని  7 మండలాలు, రెండు పట్టణాల్లో 1.25 లక్షల మొక్కలను కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అన్ని వర్గాలతో కలిసి నాటుతారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ఫోన్‌లో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ తపిస్తున్న హరిత తెలంగాణను సాధించే క్రమంలో మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో రెండు గ్రామాల్లో శుక్రవారం  పర్యటించనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ పాలన దేశానికే దిక్సూచిగా మారిందని, సాగు,తాగు నీరు, ఉచిత కరెంటు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అన్ని రాష్ర్టాలు అనుసరిస్తున్నట్లు వెల్లడించారు.  కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుందని, రానున్న తరాలు సైతం దానిని చూసి అబ్బురపడే రోజులు వస్తాయన్నారు.  నూతన సెక్రటేరియట్‌ తెలంగాణ రాష్ర్టానికి ఐకాన్‌గా మారడంతో పాటు దేశంలోని అన్ని రాష్ర్టాలు సదరు నిర్మాణాన్ని మోడల్‌గా తీసుకోవడం ఖాయమన్నారు.  కరోనా మహమ్మారి ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న సమయంలో ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీలు వారి ఉనికి కోసం రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


logo