శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 22, 2020 , 23:37:24

అభివృద్ధి పనులను పూర్తి చేయాలి

అభివృద్ధి పనులను పూర్తి చేయాలి

 సిద్దిపేట రూరల్‌ : చింతమడక గ్రామంలో పునర్నిర్మాణ పను లు వేగవంతం చేయాలని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను, ఏజెన్సీలను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన చింతమడక, సీతరాంపల్లి, మాచాపూర్‌ గ్రామాల అభివృద్ధి పనుల సమీక్షలో మంత్రి, జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు.  క్షేత్ర స్థాయిలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఎస్‌. పద్మాకర్‌, శిక్షణ కలెక్టర్‌ దీపక్‌ తివారీ, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

  స్టీల్‌ బ్యాంకులను సద్వినియోగం చేసుకోవాలి

 సిద్దిపేట కలెక్టరేట్‌ : పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.. ప్లాస్టిక్‌ వాడకం మానేయాలి.. ప్రతి వార్డులో స్టీల్‌ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నాం.. ప్రజలందరూ స్టీల్‌ బ్యాంకులను సద్వినియోగం చేసుకోవాలని  మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేటలో 27,24,29 వార్డుల్లో స్టీల్‌ బ్యాంకులను ప్రారంభించారు. బెజ్జంకి బాపురెడ్డి సోదరుడి ఇంట్లో పెళ్లి ఉందని.. మొదటి శుభలేఖ ఇచ్చి మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా  వారు స్టీల్‌ బ్యాంకులోని సామగ్రిని ఆర్డర్‌ బుక్‌ చేసుకున్నారు. స్టీల్‌ బ్యాంకు సామగ్రి కిరాయి సమగ్ర పట్టిక వివరాల బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు. వార్డుల్లో ఇంటింటా తిరిగి అవగాహన కల్పించాలని కౌన్సిలర్లు, మెప్మా, ఆర్పీలను ఆదేశించారు. అనంతరం  సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. 

 ఐదు రూపాయల భోజనానికి స్టీల్‌ ప్లేట్లు

సిద్దిపేట ముస్తాబాద్‌ జంక్షన్‌లో హరే రామ హరే కృష్ణ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐదు రూపాయల భోజన కేంద్రాన్ని మంత్రి హరీశ్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం చేస్తున్న వారితో ముచ్చటించారు. ప్లాస్టిక్‌ ప్లేట్లలో భోజనం పెట్టడాన్ని గమనించి,  వీటిని బంద్‌ చేయాలని.. స్టీల్‌ ప్లేట్లలో భోజనాలను ఏర్పాట్లు చేయాలని మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సుకు సూచించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డీఈ లక్ష్మణ్‌, కౌన్సిలర్లు గడ్డం విజ య శ్రీనివాస్‌, బూర శ్రీనివాస్‌, మోయిజ్‌ పాల్గొన్నారు. 

రూ 8.72 లక్షల చెక్కుల అందజేత 

సీఎం సహాయనిధి నిరుపేదలకు వరమని మంత్రి అన్నారు. బుధవారం సిద్దిపేటలోని తన నివాసంలో నియోజకవర్గ పరిధిలోని 18 మంది లబ్ధిదారులకు  రూ 8.72  లక్షల  సీఎం సహాయనిధి చెక్కులను  ఆయన అందజేశారు.  అంతకు ముందు మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మల్యాల బాల్‌రాజు తల్లి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని, టీటీడీ బోర్డు సభ్యుడు మురంశెట్టి రాములు తల్లి మృతి చెందగా వారి కుటుంబీకులను మంత్రి పరామర్శించారు.  ఆయన వెంట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు ఉన్నారు. 

  ఎంపిక పూర్తి చేయాలి 

 అర్హులైన లబ్ధిదారుల ఎంపిక రెండు రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి  హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌, జిల్లా ట్రైనీ ఐఏఎస్‌ కలెక్టర్‌ దీపకర్‌ తివారీ, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, వివిధ శాఖ ల అధికారులు పలు అభివృద్ధి పనుల ప్రగతి నివేదికలపై  ఆయన సమీక్ష నిర్వహించారు. నర్సాపురంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై  అధికారులతో చర్చించారు.   

కరోనా నేపథ్యంలో పాఠశాలలు తెరువడం కష్టమని, ఇందుకోసం ఇంటి వద్ద చదువుకోడానికి ప్రభుత్వం పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్‌ ప్రభు త్వ పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఇందిరానగర్‌ పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని మంత్రి అభినందించారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు పాల్గొన్నారు. 


logo