శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 21, 2020 , 23:05:10

రూ. 14.35 లక్షలతో 50 గదుల నిర్మాణం

రూ. 14.35 లక్షలతో 50 గదుల నిర్మాణం

చేర్యాల : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మంగళవారం పర్యటించారు. బండగుట్ల ప్రాంతంలో రూ.  14.35లక్షల వ్యయంతో నిర్మించే 50 గదుల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా  నిర్మాణ పనులకు సంబంధించి పంచాయతీరాజ్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు సకాలంలో పూర్తి చేసి భక్తులకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గీస భిక్షపతి, జడ్పీటీసీ సిలువేరు సిద్దప్ప, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ బత్తిని నర్సింహులు గౌడ్‌, టీఆర్‌ఎస్‌ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి సుంకరి మల్లేశం, తలారీ కిషన్‌ తదితరులు ఉన్నారు.

 ‘వెండి తాపడం’ టెండరు ఖరారు  

  కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలోని ప్రధాన ద్వారాలకు ‘వెండితాపడం’ ఏర్పాటుకు మల్లన్న ఆలయ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్‌లైన్‌ టెం డర్లు ముగిసినట్లు ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలయంలోని 5 ప్రధాన ద్వారాలు, తలుపులకు వెండితాపడం వేసేందుకు ఏపీలోని తిరుపతికి చెందిన బాలాజీ మెటల్‌ సంస్థ్ధ ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు టెండరు వేసిందన్నారు. ఆ సంస్థకే టెండర్‌ హక్కులు అప్పగించినట్లు తెలిపారు. 


logo