గురువారం 01 అక్టోబర్ 2020
Siddipet - Jul 19, 2020 , 23:38:15

మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

మత్స్యకారుల అభ్యున్నతికి  ప్రభుత్వం కృషి

మర్కూక్‌ : మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేస్తోందని సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మర్కూక్‌ మండలంలోని దత్తత గ్రామం ఎర్రవల్లిలోని ఎర్రకుంట, నల్లకుంట, మాచిరెడ్డికుంట, పాండురంగ చెరువు కుంటల్లో చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మత్స్యకారులకు చేతినిండా పని కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను నీటి వనరుల్లో వదులుతుందన్నా రు. మత్స్య కారులు చేపలతో ఉపాధి పొందాలని సూచించారు. సీఎం దత్తత గ్రామం మత్స్యకారులు చేపలను ఉత్పత్తి చేసేస్థాయికి ఎదుగాలని సూచించారు.  ఎర్రవల్లి, నర్సన్నపేటలో నెలకొన్న చిన్నచిన్న సమస్యలను సత్వరమే పరిష్కారం చేస్తామని, వారంలోపు రెండు గ్రామాల ప్రజలతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారి వెంకటయ్య, తహసీల్దార్‌ ఆరీఫా, సర్పంచ్‌ భాగ్య, ఎంపీటీసీ ధనలక్ష్మి, పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ బాలరాజు, ముదిరాజ్‌ కులస్తులు పాల్గొన్నారు.logo