శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 19, 2020 , 23:13:55

దుబ్బాక వైపు సా‘గంగా’..

దుబ్బాక వైపు సా‘గంగా’..

  • నియోజకవర్గానికి చేరుకున్న గోదావరి జలాలు
  • మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ నుంచి కాళేశ్వరం నీళ్లు
  • నియోజకవర్గంలో 1.27 లక్షల ఎకరాలకు సాగునీరు
  • ఇచ్చిన హామీని నెరవేర్చిన సీఎం కేసీఆర్‌
  • కృతజ్ఞతలు తెలుపుతున్న రైతాంగం

బీడు భూములను పచ్చని పైర్లుగా మార్చే గోదారమ్మ.. కాళేశ్వరం నుంచి గలగలా పారుతూ దుబ్బాక గడ్డను ముద్దాడింది. దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలం తుక్కాపూర్‌ పంప్‌హౌస్‌ నుంచి కాళేశ్వరం 12వ ప్యాకేజీ ప్రధాన కాల్వలోకి విడుదలైన గోదారి నీళ్లు, బిరబిరా దుబ్బాకకు చేరుతున్నాయి. గోదావరి పరవళ్లతో ఇక ఈ నియోజకవర్గం పచ్చని పంటలతో ‘ఆకుపచ్చ తివాచీగా’ మారనున్నది. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ నిజం కావడంతో నియోజకవర్గ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మంత్రి హరీశ్‌రావుతో కలిసి దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తుక్కాపూర్‌ పంప్‌హౌస్‌ నుంచి 12వ ప్యాకేజీ ప్రధాన కాల్వలోకి గోదారి జలాలను విడుదల చేశారు. ఈ ప్రధాన కాల్వల ద్వారా దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లోని పలు గ్రామాలకు సాగు నీరందుతోంది. 

కాళేశ్వరం జలాలు దుబ్బాకను ముద్దాడాయి..  నియోజకవర్గంలోని తొగుట మండలం తుక్కాపూర్‌ పంప్‌హౌస్‌ నుంచి కాళేశ్వరం 12వ ప్యాకేజీ ప్రధాన కాలువ ద్వారా గోదారి బిరాబిరా దుబ్బాకకు చేరుకున్నది. దీంతో ఎన్నో ఏండ్లుగా సాగునీటి వెతలు అనుభవిస్తున్న రైతుల బాధలు తీరనున్నాయి. ఆత్మహత్యలు చేసుకునే రోజులు పోయి ఆత్మగౌరవంతో బతికే రోజులు వచ్చాయని రైతులు సంబురపడుతున్నారు. సీఎం కేసీఆర్‌ ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో కాల్వల్లో గోదారమ్మ పరవళ్లను చూసిన  రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ.. సీఎం సారు మాటల మనిషి కాదు చేతల మనిషని నియోజకవర్గ రైతాంగం గౌరవించుకుంటున్నది.  

దుబ్బాక : బీడు భూములను పచ్చని పైర్లుగా మార్చే గోదారమ్మ.. కాళేశ్వరం నుంచి గల గల పారుతూ దుబ్బాక గడ్డను ముద్దాడింది. దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలం తుక్కాపూర్‌ పంప్‌హౌస్‌ నుంచి కాళేశ్వరం 12వ ప్యాకేజీ ప్రధాన కాలువలోకి విడుదలైన గోదారి నీళ్లు బిరాబిరా దుబ్బాకకు చేరుకున్నాయి. నియోజకవర్గంలో గోదారి పరవళ్లతో ఇక దుబ్బాక నియోజకవర్గం పచ్చని పంటలతో ‘ఆకుపచ్చ తివాచీగా’ మారనున్నది. సీఎం కేసీఆర్‌ హామీ నిజం కావడంతో నియోజకవర్గ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మంత్రి హరీశ్‌రావుతో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కలిసి తుక్కాపూర్‌ పంప్‌హౌస్‌ నుంచి 12వ ప్యాకేజీ ప్రధాన కాల్వలోకి గోదారి జలాలను విడుదల చేశారు.  ప్రధాన కాల్వల ద్వారా దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో పలు గ్రామాలకు సాగు నీరందనున్నది.

 మల్లన్న, కొండపోచమ్మ నుంచి గోదారి జలాలు..

దుబ్బాక నేలతల్లిని ముద్దాడేందుకు గోదారమ్మ  వస్తున్నది. మల్లన్నసాగర్‌ 12వ ప్యాకేజీ ప్రధాన కాల్వ నుంచి ప్యాకేజీ 3 ఎల్‌ ద్వారా దుబ్బాక నియోజకవర్గంలో  చెరువులు నింపనున్నారు. మూడు రోజుల కిందట మల్లన్నసాగర్‌ సర్జిపూల్‌ నుంచి గోదారి జలాలను ఎమ్మెల్యే రామలింగారెడ్డి విడుదల చేయడంతో దుబ్బాక మండలంలో తిమ్మాపూర్‌, అప్పనపల్లి, పెద్దగుండవెళ్లి, చెల్లాపూర్‌, రాజక్కపేట గ్రామాల్లో గోదారి జలకళ సంతరించుకున్నది. దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్‌ నుంచి తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక మండలాల్లో 66,423 ఎకరాలకు సాగు నీరు అందనున్నది. మరో పక్క దౌల్తాబాద్‌, రాయపోల్‌, చేగుంట మండలాలకు కొండపోచమ్మసాగర్‌ నుంచి గజ్వేల్‌ మీదుగా ప్రధాన కాల్వ ద్వారా మరో 60 వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నది. మిరుదొడ్డి మండలంలో మల్లన్నసాగర్‌ కాల్వల పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా దౌల్తాబాద్‌, రాయపోల్‌, చేగుంట మండలాల్లో కొండపోచమ్మ రిజర్వాయర్‌ కాల్వల పనులు కొనసాగుతున్నాయి. దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ రిజర్వాయర్ల ద్వారా మొత్తం 1.27 లక్షల ఎకరాలకు సాగు నీరందనున్నది. అలాగే, నియోజకవర్గంలో ప్రధాన వాగు కూడవెళ్లి ఇక జీవనదిగా మారనున్నది.

అదృష్టంగా భావిస్తున్నాం..

ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని నెరవేర్చారు. గోదావరి జలాలతో నియోజకవర్గం సస్యశ్యామలం కానున్నది. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు లేక ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. స్వరాష్ట్రంలో ఎన్నో సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. నియోజకవర్గానికి ముందుగానే గోదారి జలాలు రావటం అదృష్టంగా ఉంది. - సోలిపేట రామలింగారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే

కాల్వల ద్వారా నీళ్లు చూస్తాననుకోలేదు..

మా ఊరికి కాల్వల ద్వారా గోదారి నీళ్లు వస్తాయని ఎప్పుడూ ఊహించలే. సీఎం సారు మాటల మనిషి కాదు.. రైతులకు అండగా నిలిచిన దేవుడు. రైతుల కోసం ఎన్నో పథకాలు తెచ్చిండు. ఇప్పుడు మా ఊరితో పాటు పక్క ఊళ్లకు గోదారి నీళ్లు కాల్వల నుంచి పోవడం సంతోషంగా ఉంది. - మైసయ్య, రైతు అప్పనపల్లి


logo