మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 18, 2020 , 23:44:16

మొక్కల సంరక్షణ సామాజిక బాధ్యత

మొక్కల సంరక్షణ సామాజిక బాధ్యత

 సిద్దిపేట అర్బన్‌ : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో అందరూ స్వచ్ఛందం గా భాగస్వాములు కావాలని అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌, ట్రైనీ కలెక్టర్‌ దీపక్‌తివారి  అన్నారు. శనివారం పట్టణ పరిధిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో చేప ట్టిన ప్లాంటేషన్‌ను పరిశీలించారు. ప్లాంటేషన్‌ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వార్లు మాట్లాడు తూ.. యాదాద్రి (యదాద్రి డేన్స్‌ ఫారెస్ట్‌) తరహాలోనే చేప ట్టిన మియావాకీ ప్లాంటేషన్‌ను  సిద్దిపేట మహిళా డిగ్రీ కళాశాల  ప్రాం గణంలో చేపడుతామని తెలిపారు. వారి వెంట మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, హరితహారం పట్టణ అధికారి  సామల ఐలయ్య, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌కుమార్‌, మున్సిపల్‌ సిబ్బంది ఉన్నారు.


logo