మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 18, 2020 , 23:40:31

ఇంటింటా ఇన్నోవేటర్‌లో యువ శాస్త్రవేత్తలకు అవకాశం

ఇంటింటా ఇన్నోవేటర్‌లో యువ శాస్త్రవేత్తలకు అవకాశం

సిద్దిపేట కలెక్టరేట్‌ : ఔత్సాహికులు తమ ప్రతిభను చాటుకునేందుకు ఇంటింటా ఇన్నోవేటర్‌ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. శనివారం ఇంటింటా ఇన్నోవేటర్‌ కార్యక్రమంపై ఆగస్టు 15న ఔత్సాహికులు వినూత్న, కొత్త ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. విద్యార్థులు, గ్రామీణ, పట్టణ, సూక్ష్మ, చిన్న తరహాపరిశ్రమల రంగాల్లో కొత్తగా రూపొందించిన తమ ఆవిష్కరణలు పంపడానికి జూలై 20 తేదీ వరకు అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను కనబర్చుకునేందుకు వారి ఆవిష్కరణలను వాట్సాప్‌ నంబరు 9100678543కు ఈ నెల 20వ తేదీ వరకు పంపించాలన్నారు. ప్రతి జిల్లా నుంచి ఐదు దరఖాస్తులను పరిశీలించి, ఆన్‌లైన్‌ ద్వారా ఆగస్టు15న ప్రదర్శించవచ్చన్నారు. తమ ఆవిష్కరణలు రెండు నిమిషాల వ్యవధిలో రూపొందించిన వీడియో ఆవిష్కరణకు సంబంధించిన నాలుగు ఫొటోలు, ఐదు పంక్తుల్లో వివరాలు ఉండాలని తెలిపారు. జిల్లాలోని వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి, విద్య అధికారులు, జూనియర్‌, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు వారి వారి పరిధిలోని యువ శాస్త్రవేత్తలను గుర్తించి ఇన్నోవేటర్‌ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు. అన్ని గ్రామాల్లో తెలిసేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.  


logo