మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 18, 2020 , 23:25:59

దేశ రక్షణలో గాజులపల్లి వాసులు

దేశ రక్షణలో గాజులపల్లి వాసులు

సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్న పలువురు గాజులపల్లి వాసులు

ప్రాణాలను పణంగా పెట్టి దేశసేవలో.. 

దేశ రక్షణకు ప్రాణాలు అర్పిస్తామంటున్న బిడ్డలు

ఎండా, వాన,చలిని తట్టుకుంటూ భరతమాత సేవలో.. 

స్ఫూర్తిగా తీసుకొని సైన్యంలో చేరుతున్న గ్రామ యువత 

దేశంలో మనం ఈ రోజు ప్రశాంత జీవనం గడుపుతున్నామంటే దానికి కారణం సైనికులు. దేశ సరిహద్దుల్లో 24గంటలు కాపలా కాస్తూ కంటికి రెప్పలా దేశాన్ని కాపాడుతున్నారు జవాన్లు. ఎండా, వాన, ఎముకలు కొరికే చలిని తట్టుకుంటూ, కొండలు, లోయలు, రాళ్లురప్పల మధ్య ఉంటూ.. కఠిన పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెడుతూ విధులు నిర్వర్తిస్తున్నారు. పుట్టిన ఊరు, అయిన వారిని వదిలి, ఎన్నో త్యాగాలను చేస్తూ సైన్యంలో విధులు నిర్వర్తిస్తూ దేశసేవలో తరిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం గాజులపల్లికి చెందిన పలువురు సైన్యంలో విధులు నిర్వర్తిస్తూ దేశరక్షణలో భాగమవుతున్నారు. మూడేండ్ల కిందట పాకిస్థాన్‌లో నిర్వహించిన సర్జికల్‌ ్రైస్టెక్‌లో ఈ గ్రామానికి చెందిన సైనికుడు పాల్గొనడం విశేషం. 

దేశంలో మనం ఈరోజు ప్రశాంత జీవనం గడుపుతూ, సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం సైనికులు. 24గంటలు దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తూ కంటికి రెప్పలా దేశాన్ని కాపాడుతున్నారు జవాన్లు. ఎండా, వాన, ఎముకలు కొరికే చలిని తట్టుకుంటూ, కొండలు, లోయలు, రాళ్లురప్పల మధ్య ఉంటూ.. కఠిన పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెడుతూ విధులు నిర్వర్తిస్తున్నారు. పుట్టిన ఊరు, అయిన వారిని వదిలి, ఎన్నో త్యాగాలను చేస్తూ సైన్యంలో విధులు నిర్వరిస్తూ దేశసేవలో తరిస్తున్నారు. 

దౌల్తాబాద్‌:  ఎడారి ఎండలు, జమ్ముకశ్మీర్‌లో మంచుకురిసే కొండల్లో, మేఘాలయా వర్షాలు, లోయలను లెక్కచేయకుండా దేశ రక్షణలో సైనికులుగా సేవలందిస్తున్నారు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం గాజులపల్లి గ్రామవాసులు పలువురు. 2003లో గ్రామానికి చెందిన పి.భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి తొలుత సైన్యం చేరారు. ఆయన అస్సాం, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, సిక్కిం, జమ్ముకశ్మీర్‌ రాష్ర్టాల్లో హవల్దార్‌గా పలు హోదాల్లో 15 ఏండ్లు విధులు నిర్వర్తించారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని గ్రామానికి చెందిన పలువురు యువకులు సైన్యంలో చేరాలని ప్రయత్నం చేసి ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన సతీశ్‌రెడ్డి, అంజిరెడ్డి, రాజిరెడ్డి, ముత్తాగౌడ్‌, నర్సింహారెడ్డి, మేనేందర్‌రెడ్డి, మహేశ్‌యాదవ్‌ తదితరులు ఇంటర్‌, డిగ్రీ చదివే రోజుల్లో శ్రమించి సైన్యానికి ఎంపికయ్యారు. వీరంతా అనేక రాష్ర్టాల్లో సైనికులుగా విధులు నిర్వర్తించారు. పాకిస్థాన్‌, చైనా సరిహద్దులో సేవలందించారు. కె.నర్సింహారెడ్డి అనే సైనికుడు మూడేండ్ల కిందట పాకిస్థాన్‌లో జరిగిన సర్జికల్‌ ్రైస్టెక్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఆయన రైఫిల్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.  

మారుమూల పల్లె నుంచి...

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం గాజులపల్లి మారుమూలం. 2500 జనాభా ఉన్న ఈ గ్రామంలో 1200 మంది ఓటర్లు ఉన్నారు. ఎక్కువగా వ్యవసాయం ఆధారపడి బతుకున్నారు. గాజులపల్లి గ్రామం నుంచి ప్రస్తుతం సైన్యంలో 8 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. కొద్దిరోజుల కిందట ఆరుగురు గ్రామ యువకులు కొద్దిపాటిలోఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో అవకాశాన్ని కోల్పోయారు. మరో 40 మంది వరకు సైన్యానికి ప్రయత్నిస్తున్నారు. ఒకరిని స్ఫూర్తిగా తీసుకొని మరొకరు సైన్యంలో ఎంపిక కావడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఎన్నో త్యాగాలు చేస్తూ...

సైనికుడిగా విధులు నిర్విర్తిస్తున్నారంటే ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. కన్నవారిని, కట్టుకున్న వారిని, స్నేహితులు, బంధువులు అందరినీ వదిలి, నెలల పాటు ఇంటికి దూరంగా.. సరిహద్దున ఉంటూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఒక్కోసారి నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఒక్కోసారి శుభకార్యాలు, ఇతరత్రా ఆపతి కార్యక్రమాలకు హాజరు కాలేని పరిస్థితులు ఉంటాయి. సరిహద్దున ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం అలుముకున్నప్పుడు సైనికుల కుటుంబాల్లో ఒక విధమైన భయాందోళన నెలకొంటుంది. సరిహద్దున విధులు అంటేనే అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. శత్రువు ఏ సమయంలో, ఎక్కడి నుంచి దాడిచేస్తాడో, ఎలా దొంగదెబ్బ తీస్తాడో తెలియని పరిస్థితి ఉంటుంది. ఉద్రికత్తలు పెరిగినప్పుడు, తీవ్రవాదులు దాడిచేసినప్పుడు, ఎన్‌కౌంటర్లు, ఆపరేషన్లలో పాల్గొనే సమయంలో పరిస్థితులు భయానంగా, దుర్భరంగా ఉంటాయి. ఆ సమయంలో సైనికులు తీవ్ర మానసిక సంఘర్షణ, ఒత్తిడికి గురవుతుంటారు. ప్రతికూల పరిస్థితులు, ప్రతికూల వాతావరణంలో శత్రువుతో పోరాడాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఎందరో సైనికులు వీరమరణం పొందడం చూశాం. కానీ, ఇవన్ని లెక్కచేయకుండా శత్రువుతో పోరాడేందుకు ముందుంటున్నారు. సైనికులు దేశ రక్షణకే పరిమితం కాకుండా వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల రక్షణలో, సాయం అందించడంలోనూ ముందుంటున్నారు. అందుకే జై జవాన్‌ అన్నారు. 

సరిహద్దులో సైనికుడిగా..

నేను ఇంటర్మీడియట్‌ పూర్తి 2015లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో పాసై సైన్యంలో చేరా.   ప్రస్తుతం పాకిస్థాన్‌కు అతి దగ్గరలో జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్‌ రెజిమెంట్‌లో సిపాయిగా విధులు నిర్వర్తిస్తున్నా. దేశానికి సేవచేసే భాగ్యం దొరికినందుకు సంతోషపడుతున్నా.- కె.మేనేందర్‌రెడ్డి, గాజులపల్లి
logo