గురువారం 01 అక్టోబర్ 2020
Siddipet - Jul 17, 2020 , 23:13:02

స్వీయ నియంత్రణే శ్రీరామరక్షస్వీయ నియంత్రణే శ్రీరామరక్ష

స్వీయ నియంత్రణే శ్రీరామరక్షస్వీయ నియంత్రణే శ్రీరామరక్ష

  • జాగ్రత్తలు పాటిస్తే కరోనా దరిచేరదు 
  • రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలి
  • జిల్లాలో అన్ని పీహెచ్‌సీలకు ర్యాపిడ్‌ కిట్లు పంపిణీ
  • 2.33 లక్షల మాస్కులు అందజేశాం
  • అందుబాటులో బెడ్లు, మందులు
  • కరోనా లక్షణాలున్న వారి వివరాలు సేకరిస్తున్నాం
  • ‘నమస్తే తెలంగాణ’తో మెదక్‌ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు

స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనా మహమ్మారికి దూరంగా ఉండవచ్చని, ఈ పరిస్థితుల్లో పండుగలు, శుభకార్యాలు, జనసమ్మర్ధ ప్రాంతాలకు వెళ్లక పోవడమే మంచిదని, పౌష్టికాహారం తీసుకుంటే జబ్బులను ఎదుర్కోవచ్చని, కరోనా బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని మెదక్‌ జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై శుక్రవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. మెదక్‌ జిల్లా కేంద్ర దవాఖానలో 50బెడ్లు, నర్సాపూర్‌ ఏరియా దవాఖానలో 30, తూప్రాన్‌ పీహెచ్‌సీలో 30 బెడ్లు కరోనా బాధితులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రజలు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు. -మెదక్‌ 

మెదక్‌ : స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనాను జయిస్తాం...కరోనాతో ముప్పు లేదు..ప్రజలు అనవసరంగా ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలి...మెదక్‌ జిల్లాకేంద్ర దవాఖానతో పాటు అన్ని పీహెచ్‌సీల్లో కరోనా నియంత్రణకు వైద్యులు అన్నిచర్యలు తీసుకుంటున్నారు. మెదక్‌ జిల్లా కేంద్ర దవాఖానలో 50బెడ్లు, నర్సాపూర్‌ ఏరియా దవాఖానలో 30, తూప్రాన్‌ పీహెచ్‌సీలో 30 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. మెదక్‌ జిల్లాలో 115 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దు. మెదక్‌ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువ మొత్తంలో ఉన్నట్టు వస్తున్న ప్రచారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారని మెదక్‌ జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలకు ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్ల పంపిణీ 


మెదక్‌ జిల్లాకేంద్ర దవాఖానతో పాటు నర్సాపూర్‌, తూప్రా న్‌ ఏరియా దవాఖానలు, రామాయంపేటలో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌తో పాటు 19 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఈ పీహెచ్‌సీల్లో కరోనా నివారణకు మెరుగైన వైద్యసేవలను వైద్యులు, సిబ్బంది అందిస్తున్నారు. ఇప్పటికే అన్ని పీహెచ్‌సీలకు కరోనా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌లను అందజేశాం. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్నీ పీహెచ్‌సీల్లో వైద్యులను అప్రమత్తం చేశాం. కరోనా లక్షణాలు ఉన్నట్టు తెలిస్తే వెంటనే వైద్య సిబ్బందితో పాటు ఆశ కార్యకర్తలు ఇంటికి వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉంచి సేవలు అందిస్తున్నారు. రోజువారీగా వైద్య సిబ్బంది కరోనా రోగి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తున్నారు. ఇంట్లో వైద్య చికిత్సలు పొందుతున్న రోగులు తొందరగా కోలుకుంటున్నారు. 

జిల్లాలో కరోనా చికిత్స కోసం 110 బెడ్లు

మెదక్‌ జిల్లాలో కరోనా వైరస్‌ బాధితుల కోసం చికిత్సలు అందించడానికి అందుబాటులో బెడ్లను ఏర్పాట్లు చేశాం. మెదక్‌ జిల్లాకేంద్ర దవాఖానలో 50 బెడ్లు, తూప్రాన్‌ ఏరియా దవాఖానలో 30, నర్సాపూర్‌ ఏరియా దవాఖానలో 30 బెడ్లు అందుబాటులో ఉన్నా యి. ప్రస్తుతానికి మెదక్‌ జిల్లాలో 115 కరోనా కేసులు నమోదు కాగా, 55 మంది చికిత్స పొందుతున్నారు. అందులో 44 మంది ఇంట్లోనే ఉన్నారు. 11 మంది దవాఖానలో ఉన్నారు. హోంక్వారంటైన్‌లో 178 మంది ఉన్నారు. 200 వరకు పీపీఈ కిట్లు, ఇతర అన్నిరకాల మం దులు అందుబాటులో ఉన్నాయి. కరోనా వైరస్‌ విషయంలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. 

మెదక్‌ జిల్లాలో 2.33లక్షల మాస్కులు పంపిణీ 

మెదక్‌ జిల్లాలోని 20 పీహెచ్‌సీలతో పాటు జిల్లా కేంద్ర దవాఖాన, రెండు ఏరియా దవాఖానలు, ఒక సీహెచ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 2.33లక్షల మాస్కులు పం పిణీ చేశాం. డీఆర్‌డీవో ఆధ్వర్యంలో 4వేల మాస్కులను కుట్టి ఇచ్చారు. 15వేల గ్లౌస్‌లు మరో వారం రోజు ల్లో రానున్నాయి. 

పండుగలు, పబ్బాలకు వెళ్లకండి..

కరోనా నేపథ్యంలో పండుగలు, శుభకార్యాలు, ఫంక్షన్ల్లకు వెళ్లకుండా ఉంటే మంచిది. ఒక ఫంక్షన్‌కు వెళ్లితే జన సమూహం ఉంటుంది. 100 నుంచి 200 మంది హాజరవుతారు. అందులో ఎవరికి కరోనా లక్షణాలు ఉన్నాయో తెలియదు. ఎదుటి వారు మాస్కు ధరించకుండా ఉంటే, అది కూడా మనకే ఇబ్బంది. అందుకే ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండడమే ప్రస్తుతం మంచిది. అనవసరంగా ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండండి. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలి. తగిన జాగ్రత్తలు పాటిస్తే కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండవచ్చు.

రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలి 

ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం తాజా కూర గాయలు, పండ్లు తీసుకోవాలి. స్కిన్‌లెస్‌ చికెన్‌ తో పాటు గుడ్లు, మాంసం తీసుకోవచ్చు. విటమిన్‌-సీ లో నిమ్మజాతి పండ్లు, నారింజ, దానిమ్మ, బత్తాయి లాంటి పండ్లు తీసుకోవాలి. ఇలాంటి పండ్లతో పాటు తాజా కూరగాయలు తీసుకుంటే రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. దీంతో జబ్బుల బారి నుంచి తట్టుకోవచ్చు. 


logo