మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 16, 2020 , 23:15:06

మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలి

మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలి

  • జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌

మెదక్‌ రూరల్‌ : ప్రతి ఒక్కరూ మొక్కల సంరక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌ అన్నారు. గురువారం మెదక్‌ మండలంలోని చిట్యాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మండల విద్యాధికారి నీలకంఠం, సర్పంచ్‌ వెంకటేశంతో కలిసి డీఈవో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు 5 ఎకరాల స్థలం ఉన్నందున, సాధ్యమైనన్ని మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణకు సూచించారు. పాఠశాల ప్రహరీ నిర్మాణానికి ఎస్‌ఎంసీ, గ్రామ పంచాయతీ తీర్మానాలు చేసి ప్రతిపాదనలు పంపితే కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ యాదగౌడ్‌, పాఠశాల కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు పండరి, ఉపాధ్యాయులు సదన్‌కుమార్‌, నర్సింహులు, సోబేద్‌అలీ, ఏపీవో ఆదినారాయణ, సీఆర్పీ జ్యోతి పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

చిన్నశంకరంపేట: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌ అన్నారు. గురువారం చిన్నశంకరంపేటలోని కస్తూర్భా బాలికల గురుకుల పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీఈవో రమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో 14వేల మొక్కలు నాటామన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ గీత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మల్కాపూర్‌ అటవీ ప్రాంతంలో..

హరితహారంలో భాగంగా మండల పరిధిలోని మల్కాపూర్‌ తండా అటవీ ప్రాంతంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఉపాధిహామీ మండల అదనపు ప్రాజెక్ట్‌ అధికారి ఆదినారాయణ మాట్లాడుతూ 5 రోజుల నుంచి ఉపాధిహామీ కూలీలతో తండా అటవీ ప్రాంతంలో సుమారు 4వేల మొక్కలు నాటినట్లు తెలిపారు. ఆయన వెంట టెక్నికల్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌ ఉన్నారు. 

హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలి

పెద్దశంకరంపేట : మండలంలోని గ్రామాల్లో మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఎంపీడీవో రాంనారాయణ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన ఈజీఎస్‌, గ్రామ కార్యదర్శుల సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో సెగ్రిగేషన్‌ షెడ్ల, వైకుంఠధామాల నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరలో పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో ఏపీఎం గోపాల్‌, ఏపీవో సుధాకర్‌ పాల్గొన్నారు. 


logo