శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 16, 2020 , 23:15:23

సెప్టెంబర్‌ నాటికి సిద్ధం కావాలి

సెప్టెంబర్‌ నాటికి సిద్ధం కావాలి

  •   సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి

గజ్వేల్‌ : కరోనాతో ఇండ్ల నిర్మాణ పనుల్లో జాప్యం జరుగకుండా నిర్మాణ సంస్థ ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. గజ్వేల్‌ మండలం ముట్రాజ్‌పల్లిలో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ పనులపై గురువారం కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. మల్లన్నసాగర్‌ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఆ ముంపు గ్రామాల నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న ముట్రాజ్‌పల్లి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ పనులు పూర్తయితే, వారు వెంటనే ఇండ్లలోకి మారడానికి వీలు ఉంటుందన్నారు. కాలనీలో ఇండ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని, ఎక్కువ సంఖ్యలో కార్మికులు, మేస్త్రీలను ఏర్పాటు చేసి, పనుల్లో మరింత వేగం పెంచాలని సూచించారు. అవసరమైతే ఆధునిక యంత్రాలను వినియోగించాలన్నారు. 500 ఇండ్లకు ఇంకా స్లాబులు పడాల్సి ఉందని, వాటికి ఎప్పుడు వేస్తారో చెప్పాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను ప్రశ్నించారు. ఈ సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ పద్మాకర్‌, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, పీఆర్‌ ఎస్‌ఈ కనక రత్నం, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, అధికారులు వేణు, రాంచద్రం, ప్రజారోగ్య ఈఈ వీరప్రతాప్‌, డీఈ గోపాల్‌, తహసీల్ద్దార్‌ అన్వర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo