శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 16, 2020 , 02:40:25

పది రోజుల్లో పూర్తి చేయాలి

పది రోజుల్లో పూర్తి చేయాలి

  • సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి 

సిద్దిపేట కలెక్టరేట్‌ : జిల్లాలో పదిరోజుల్లో వైకుంఠధామాలు.. డంపింగ్‌ యార్డులు పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి సూచించారు. ఎక్కడైనా పనులు ప్రారంభం కాకపోతే వెంటనే ప్రారంభించాలని, అవసరమైన మెటీరియల్‌, ఇసుక, సిమెంట్‌, కూలీలను సమకూర్చుకోవాలన్నారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్‌ కార్యాలయంలో డీఆర్‌డీవో పీడీ గోపాల్‌రావుతో కలిసి ఎంపీడీవోలు, ఎంపీవోలు, సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన టెలీకాన్ఫరెన్స్‌లో పలు ఆదేశాలు జారీ చేశారు. అన్ని మండలాల్లో 25 లోపు 50 రైతుకల్లాల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. రానున్న నాలుగు వారాల్లో 50 చొప్పున నిర్మాణ పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలసత్వం వహించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నెల 18న తిరిగి సమావేశం ఏర్పాటు చేస్తామని, ఆ రోజు సంబంధిత ఫొటోలతో హాజరు కావాలన్నారు. గొర్రెల షెడ్లు, పశువుల పాకలు ప్రతి మండలానికి పది పది చొప్పున 25వ తేదీలోపు నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు

.రైతుబంధు వివరాలు సరి చేయండి

 తప్పుడు వివరాలతో జిల్లాలోని 496మందికి రైతుబంధు అందలేదని, సంబంధిత రైతుల వివరాలు పూర్తిగా సేకరించి, రేపటిలోగా సరి చేయాలని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో రైతుబంధు గ్రీవెన్సీపై అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌, ఆర్డీవోలు, అన్ని మండలాల తహసీల్దార్లు, వ్యవసాయాధికారులతో జూమ్‌ యాప్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్థానికంగా లేనందున 1523 మంది రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చలేదన్నారు. ఆ రైతుల వివరాలు సేకరించి సరైన కారణాలు చూపుతూ ఆన్‌లైన్‌లో పొందుపర్చాలన్నా రు. వివిధ కారణాల చేత జిల్లాలో రైతుబం ధు పొందని రైతు ల వివరాలు, డిజిటల్‌ సైన్‌ కానీ ఖాతాలు, విస్తీర్ణంలో తేడాగా ఉన్న రైతుల వివరాలు సేకరించి 18వ తేదీలోగా పూర్తి వివరాలు నమోదు చేయాలన్నారు.

అభివృద్ధి పనులపై సీఎస్‌ వీసీ

మెదక్‌/ సంగారెడ్డి / సిద్దిపేట కలెక్టరేట్‌ : అభివృద్ధి పనులపై బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో చేపట్టాల్సిన రైతు వేదికల నిర్మాణం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు కేటాయింపు రైతు కల్లాలు నిర్మించడం, జాబ్‌కార్డుల జారీ, ప్రభుత్వ పనులకు కూలీల సమీకరణ, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌ ఖర్చుపై సుదీర్ఘంగా చర్చించారు.  పలు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. నూతనంగా మున్సిపాలిటీల్లో విలీనమైన జీపీలకు మౌలిక వసతులు కల్పించి, ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. రైతుబంధు రాని వారిని గుర్తించి, కారణాలు పరిష్కరించి, వారికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలపై కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి సోమేశ్‌కుమార్‌కు నివేదించారు.


logo