శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 14, 2020 , 23:54:23

కౌన్సిలర్లు భాగస్వాములు కావాలి

కౌన్సిలర్లు భాగస్వాములు కావాలి

  •  శాసనసభా అంచనాల కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే  రామలింగారెడ్డి

దుబ్బాక టౌన్‌: దుబ్బాక రామసముద్రం చెరువు కట్ట అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర శాసనసభా అంచనాల కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. ప్రతి మంగళవారం చెరువు కట్ట పై శ్రమదానం చేసి పిచ్చి మొక్కల తొలగింపుతో పాటు హరితహారంలో విధిగా ప్రతి కౌన్సిలర్‌ భాగస్వాములై మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం పలు వార్డు కౌన్సిలర్లతో కలిసి చెరువు కట్టపై శ్రమదానం చేశారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గన్నె వనితభూంరెడ్డి, కమిషనర్‌ గోల్కొండ నర్స య్య, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.

  రైతు బీమాతో ఆర్థికంగా దీమా

దౌల్తాబాద్‌: రైతుబీమా పథకం బాధిత కుటుంబాలకు ఆర్థిక దీమా కల్పిస్తున్నదని, అన్నదాతల కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే సోలిపేట అన్నారు. దౌల్తాబాద్‌ మండల పరిధి కోనాయిపల్లి, గొడుగుపల్లి, లింగాయిపల్లితండా గ్రామాల్లో ఇటీవల వివిధ కారణాలతో ముగ్గురు రైతులు మృతి చెందగా, రూ.5లక్షల చొప్పున వచ్చిన రైతుబీమా బాండ్లను బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే అందజేశారు. ఏఈ వో గోవిందరాజులు, వైస్‌ ఎంపీపీ శేఖర్‌రెడ్డి, సర్పంచ్‌లు సురేందర్‌రెడ్డి, శివకుమార్‌, బానోతు దేవియాదగిరి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.logo