శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 14, 2020 , 23:54:24

అభివృద్ధి పనులను పూర్తి చేయాలి

అభివృద్ధి పనులను పూర్తి చేయాలి

మర్కూక్‌ : మండలంలోని గణేశ్‌పల్లిలో మంగళవారం గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి పర్యటించారు. గ్రామంలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. చౌరస్తాలో అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్‌, సీసీరోడ్లు, అండర్‌ డ్రైనేజీ కాలువలు, కరెంట్‌ సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తెచ్చారు. త్వరలో గ్రామ సమస్యలను పరిష్కరిస్తామని గడా ఓఎస్డీ  హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పం చ్‌ మంజులాశ్రీరాములు, ఉప సర్పంచ్‌ మహేశ్‌, గడా ఎంపీడీవో పట్టాభిరాం, పంచాయతీ కార్యదర్శి బాబు, టీఏ సురేశ్‌ పాల్గొన్నారు. 

తీగుల్‌లో గడా ప్రత్యేకాధికారి పర్యటన

జగదేవ్‌పూర్‌ : అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి అన్నారు. మండలంలోని తీగుల్‌ గ్రామం లో సర్పంచ్‌ భానుప్రకాశ్‌రావు, సెక్రటరీ శ్రీనుతో కలిసి పర్యటించారు. నూతనంగా మురుగునీటి కాలువలను నిర్మించాలని, పాత బావులను వెంటనే పూడ్చి వేయాలని సూచించారు. హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని గ్రామస్తులను కోరు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయించాలని పంచాయతీ పాలక వర్గానికి సూచించారు. 


logo