సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 14, 2020 , 23:31:26

పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు

పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే  కఠిన చర్యలు

  • పల్లె ప్రగతితో జిల్లాను   ఆదర్శంగా నిలుపాలి
  • సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి వెల్లడి

రాయపోల్‌ : పల్లె ప్రగతి లక్ష్యాలను వెంటనే పూర్తి చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం రాయపోల్‌ మండలకేంద్రంలో పల్లె ప్రగతిపై వివిధ గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు, ఆయా శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు.  దేశంలో ఎక్కడ లేని విధం గా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలను అభివృద్ధి చేసేందుకు ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్‌, ట్యాంకర్‌, నర్సరీ, డంపింగ్‌యార్డు, వైకుంఠ ధామం తదితర వాటిని అందజేసిందని, పల్లె ప్రగతి పనులపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయాన్నారు.  హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచిం చారు. అనంతరం కలెక్టర్‌ గ్రామాల వారీగా మండల అభివృద్ధిపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌, గజ్వేల్‌ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి,డీపీవో సురేశ్‌ బాబు,డీఆర్‌డీఏ పీడీ గోపాల్‌రావు, ఏపీడీ కౌసల్యాదేవి, డీఎల్‌పీవో నాగరాజు, ఎంపీపీ కల్లూరి అనిత, జడ్పీటీసీ యాదగిరి, మార్కెట్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, రైతు బంధు అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఎంపీడీవో స్వర్ణకుమారి సర్పంచ్‌లు పాల్గొన్నారు.logo