మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 14, 2020 , 03:39:01

నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి

నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి

కౌడిపల్లి : ఆరోవిడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని ఎంఈవో చంద్రశేఖర్‌ అన్నారు. సోమవారం మండల పరిధిలోని రాయిలాపూర్‌లోని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మండలంలో పలు గ్రామాల్లోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల ఆవరణలో ప్రధానోపాధ్యాయులు మొక్కలు నాటారు. 

పచ్చని చెట్లతోనే పర్యావరణ పరిరక్షణ..

కొల్చారం : పచ్చని చెట్లతోనే పర్యావరణ పరిరక్షణ నెలకొంటుందని కొల్చారం జడ్పీటీసీ మేఘమాల, ఎంపీపీ మంజుల అన్నారు. సోమవారం కొల్చారంలోని పాఠశాల ఆవరణలో జడ్పీటీసీ మేఘమాల, సర్పంచ్‌ ఉమతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ, ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వామనరావు, ఎస్సై శ్రీనివాస్‌గౌడ్‌, ఎంఈవో నీలకంఠం ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.  

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి..

చిలిపిచెడ్‌ : నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని అజ్జమర్రి ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌ వీరస్వామి తెలిపారు. మండలంలోని అజ్జమర్రి, గౌతాపూర్‌, చండూర్‌ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల ఆవరణలో  ప్రధానోపాధ్యాయులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. 

మొక్కలు నాటడం అందరూ  బాధ్యతగా తీసుకోవాలి.. 

చిలిపిచెడ్‌ : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి, సర్పంచ్‌ బుజ్జిబాయి అన్నారు. మండలంలోని బద్రియతండాలో తండా ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన పంచాయతీ కార్యదర్శి మోహన్‌తో కలిసి మొక్కలు నాటారు. 

పలు గ్రామాల్లో జోరుగా హరితహారం..

చేగుంట : మండల పరిధిలోని బి-కొండాపూర్‌లో హరితహారం కార్యక్రమంలో భాగంగా సర్పంచ్‌ నీరుడు బాల్‌నర్సు, ఉపసర్పంచ్‌ తోట రమేశ్‌, ఎంపీటీసీ గుటం నవీన్‌ మొక్కలు నాటారు. చందాయిపేటలో సర్పంచ్‌ స్వర్ణలత, హెచ్‌ఎం బాలచందర్‌, ఉపాధ్యాయులు, వార్డుసభ్యులతో కలిసి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. నార్సింగి మండలం నర్సంపల్లిలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఎంపీపీ చిందం సబిత, సర్పంచ్‌ భారతితో కలిసి మొక్కలు నాటారు. వల్లూర్‌ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సర్పంచ్‌ ఆనందాస్‌ మహేశ్వరి, హెచ్‌ఎం అశోక్‌, పంచాయతీ కార్యదర్శి సబితలతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు ప్రవళిక, అంగన్‌వాడీ టీచర్‌ జయ పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో..

మనోహరాబాద్‌ : మనోహరాబాద్‌ మండలంలోని  గౌతోజిగూడెం, రంగాయిపల్లి, కోనాయిపల్లి పీటీలతో పాటు ఆయా గ్రామాల ప్రభుత్వ పాఠశాలల్లో మొక్కలను నాటి ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు ప్రభావతి, వెంకటేశ్వర్లు, నాగభూషణం, ఉపసర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు ధర్మేందర్‌, ప్రధాన కార్యదర్శి రేణుకుమార్‌, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. 

హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి..

వెల్దుర్తి : ఆరోవిడుత హరితహారం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ఎంఈవో యాదగిరి అన్నారు.  వెల్దుర్తిలో ఎంఈవో ఉపాధ్యాయులతో కలిసి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొక్కలను నాటారు. రామంతపూర్‌, ఏదులపల్లిలో సర్పంచ్‌లు ప్రణిత, భూమయ్య ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లతో కలిసి మొక్కలను నాటారు. 

హరితహారంలో విరివిగా మొక్కలు నాటాలి..

నిజాంపేట : హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని ఉపాధ్యాయులు భాను, జాకీర్‌ అన్నారు. సోమవారం మండలంలోని కల్వకుంటలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో వార్డుసభ్యుడు జోగెల్లి లావణ్యరాజు, అంగన్‌వాడీ టీచర్‌ లలిత పాల్గొన్నారు. 

అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవు

మనోహరాబాద్‌ : ఆన్‌లైన్‌ క్లాసుల పేరిట అధిక ఫీజులను వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని డీఈవో రమేశ్‌ కుమార్‌ అన్నారు. మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌, ముప్పిరెడ్డిపల్లి గ్రామాల ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్‌ క్లాసుల పేరిట కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు అధిక ఫీజులు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి పుస్తకాలు వచ్చాయని, త్వరలోనే వాటిని పాఠశాలలకు సరఫరా చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ప్రభావతి, ఇన్‌చార్జి సర్పంచ్‌ కాళిదాస్‌, ఆత్మకమిటీ డైరెక్టర్‌ రాహుల్‌, నాయకులు పురం రవి, ఇర్ఫాన్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo