శనివారం 08 ఆగస్టు 2020
Siddipet - Jul 12, 2020 , 23:58:01

కరోనా కట్టడికి వినూత్న ప్రచారం

కరోనా కట్టడికి వినూత్న ప్రచారం

దౌల్తాబాద్‌: కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ స్వీయనియంత్రణ, భౌతిక దూరం పాటించాలి.., తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. సబ్బు, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని గ్రామాల్లో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఎల్‌ఈడీ స్క్రీన్‌ ద్వారా వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. ఆదివారం ఎస్‌ఐ చంద్రశేఖర్‌ దౌల్తాబాద్‌ మండల కేంద్రంతో పాటు దొమ్మాట గ్రామంలో సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, ఉన్నతాధికారులు చేసిన సూచనలతో కూడిన వీడియోను ఇలా ప్రదర్శిస్తూ అవగాహన కల్పించారు.

రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడంతో జనంలో ఒక విధమైన భయాందోళన నెలకొంది. మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నా యి. వైరస్‌ బారిన పడిన వారు చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాధితులకు జిల్లాలోనే వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా 100 పడకలతో సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ దవాఖానలో ప్రత్యేక కొవిడ్‌-19 చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీనిని ఈ నెల 15న ప్రారంభించనున్నారు. ఆదివారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు దీనిని పరిశీలించారు. ఇందు లో 8 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, 27 మంది వైద్యులు అందుబాటులో ఉండి సేవలందిస్తారు. 35 వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, N-95 మాస్కులను అందుబాటులో ఉంచారు. logo