శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 12, 2020 , 23:30:19

భౌతిక దూరంతో మల్లన్న దర్శనం

భౌతిక దూరంతో మల్లన్న దర్శనం

చేర్యాల : కొమురవెల్లి మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం సుమారు మూడు వేల మంది భక్తులు తరలివచ్చినట్లు ఆలయవర్గాలు తెలిపాయి. రాజగోపురంతో పాటు ఆలయ ప్రధాన వీధులు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయవర్గాలు భక్తులకు శానిటైజ్‌, థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి ఆలయ ప్రవేశానికి అనుమతినిచ్చారు. ఈవో టంకశాల వెంకటేశ్‌, ఏఈవో గంగా శ్రీనివాస్‌, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్‌, సూపరింటెండెంట్‌ నీల శేఖర్‌, సిబ్బంది భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. 


logo