బుధవారం 12 ఆగస్టు 2020
Siddipet - Jul 12, 2020 , 01:31:19

మెదక్‌ను స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దుదాం

మెదక్‌ను స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దుదాం

వెల్దుర్తి : మెదక్‌ను స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అన్నారు. శనివారం మండలంలోని మన్నెవారి జలాల్‌పూర్‌లో ఉన్న అటవీప్రాంతంలో వైకుంఠధామం నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 469 గ్రామ పంచాయతీల్లో 300 వైకుంఠధామ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, మరో 169 గ్రామ పంచాయతీల్లో పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లాను ఓడీఎఫ్‌ ప్లస్‌ స్థాయి వచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం ఘన, ద్రవ్య వ్యర్థాల నిర్వహణతో పాటు ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. అటవీభూముల వివరాలు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయడంతో గతంలో పట్టాలు ఇచ్చిన వారికి ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం ద్వారా భూములను కేటాయిస్తుందన్నారు. ఆయన వెంట జడ్పీటీసీ రమేశ్‌గౌడ్‌, తహసీల్దార్‌ ఆనంద్‌రావు, ఎంపీడీవో జగదీశ్వర చారి, ఆర్‌ఐ ధన్‌సింగ్‌, సర్వేయర్‌ నర్సింహులు, అటవీ బీట్‌ అధికారి శోభారాణి, నాయకులు కృష్ణ, రామాగౌడ్‌, ఈవో శ్రీనివాస్‌, గ్రామస్తులు ఉన్నారు. logo