శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 10, 2020 , 23:37:24

అందంగా.. ఆకర్షణీయంగా..

అందంగా.. ఆకర్షణీయంగా..

డంపింగ్‌ యార్డులంటే దుర్గంధం నిండి కంపుతో ముక్కుపుటాలదురుతాయి. కానీ, సిద్దిపేట రూరల్‌ మండలం పెద్దలింగారెడ్డిపల్లిలో నిర్మించిన డంపింగ్‌ యార్డు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తున్నది. సర్పంచ్‌ తౌటి ఉదయశ్రీ ఆధ్వర్యంలో గ్రామ శివారులో డంపింగ్‌ యార్డును అందంగా తీర్చిదిద్దారు. సేంద్రియ ఎరువుల తయారీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, పరిసరాల పరిశుభ్రతను తెలియజేసేలా పలు చిత్రాలు ఇక్కడ గీయించారు. ప్రజలకు పర్యావరణ స్పృహ కలిగించేందుకు దీనిని అలా తీర్చిదిద్దారు. 


logo