ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 10, 2020 , 02:36:16

ఆలయంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూజలు

 ఆలయంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూజలు

నర్సాపూర్‌: పట్టణంలోని శ్రీరాయారావు చెరువు కట్టపై నిర్మించిన శ్రీరేణుకా పరమేశ్వరీ ఎల్లమ్మ ఆలయం మహోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. పట్టణానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు కుమ్మరి సురేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలకు ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌తో పాటు కౌన్సిలర్లు హాజరై ఆలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో పట్టణ ప్రజలు, కుమ్మరి సంఘం నాయకులు పాల్గొన్నారు.


logo