ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 07, 2020 , 02:20:28

రైతు వేదికల నిర్మాణానికి భూమిపూజ

రైతు వేదికల నిర్మాణానికి భూమిపూజ

పాపన్నపేట : పొడ్చన్‌పల్లి, కొత్తపల్లి గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి సోమవారం అదనపు కలెక్టర్‌ నగేశ్‌ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు తాడేపు సోములు, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు గడీల శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు షర్మిలారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, కొత్తపల్లి గ్రామ సర్పంచ్‌ కుమ్మరిజగన్‌, పొడ్చన్‌పల్లి సర్పంచ్‌ కృష్ణారెడ్డి, కొత్తపల్లి, ఉపసర్పంచ్‌ బైండ్ల సత్యనారాయణ, పొడ్చన్‌పల్లి మాజీ సర్పంచ్‌ ప్రతాప్‌రెడ్డి, తహసీల్దార్‌ బలరాం, మండల వ్యవసాయశాఖ అధికారి ప్రతాప్‌కుమార్‌ వివిధ గ్రామాల ఏఈవోలు ఆయా గ్రామ రైతులు పాల్గొన్నారు.

అన్నదాతలకు అండగా..

మెదక్‌ రూరల్‌ : అన్నదాత శ్రేయస్సే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముదుకెళ్తుందని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు అన్నారు. సోమవారం రాజ్‌పల్లిలో రైతు వేదిక భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అన్నదాతల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న  ప్రభుత్వం, ఆధునిక పద్ధ్దతిలో 500 గజాల స్థలంలో రైతు వేదికలను కూడా నిర్మిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ అంజనేయులు, గ్రామ సర్పంచ్‌ ప్రేమలత, మండల వ్యవసాయధికారి లక్ష్మీప్రవీణ్‌, ఏఈవో భార్గవి, వార్డు సభ్యులు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎలక్షన్‌రెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు

పాతూర్‌లో...

పాతూర్‌లో రైతు వేదిక నిర్మాణానికి జిల్లా వ్యవసాయధికారి పరశురాం నాయక్‌ భూమి పూజ చేశారు. ఆయనవెంట గ్రామ సర్పంచ్‌ లింగవ్వ, ఎంపీటీసీ శ్రీహరి, రైతుబంధు సమితి సభ్యులు ఉన్నారు.  


logo