శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 07, 2020 , 02:20:27

హరిత పట్టణంగా తీర్చిదిద్దాలి

హరిత పట్టణంగా తీర్చిదిద్దాలి

  • మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రజిత

హుస్నాబాద్‌:  పట్టణాన్ని హరిత పట్టణంగా తీర్చిదిద్దడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు భాగస్వాములు కావాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత అన్నారు. సోమవారం పట్టణంలోని 1వ వార్డులో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి కాలనీ ఆకుపచ్చ కాలనీగా మా రాలన్నారు.  హరితహారంలో పెట్టుకున్న లక్ష్యాన్ని అనుగుణంగా అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రాజమల్లయ్య, కౌన్సిలర్లు కొంకట నళినిదేవి, గోవిందు రవి,  హరీశ్‌, మాజీ ఎంపీపీ వెంకట్‌, నాయకులు ఎండీ అన్వర్‌, అయూబ్‌, శ్రీను, గోనెల మధుకర్‌, డాక్టర్‌ రవి, సతీష్‌, పాల్గొన్నారు

పర్యావరణ పరి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత..ఎంపీపీ గంగాధరిసంధ్య

దౌల్తాబాద్‌: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్క రి బాధ్యత అని ఎంపీపీ గంగాధరి సంధ్య అన్నా రు.  మండల పరిధిలోని లింగరాజుపల్లి వద్ద ఎంజేపీ గురుకుల పాఠశాలలో ఎం పీపీ సంధ్య, సర్పంచ్‌ మర్కింటి కేత కనకరాజు, పాఠశాల ప్రిన్సిపాల్‌ శోభారాణి, తహసీల్దార్‌ ఉమారాణి, ఎంపీడీవో మశ్చేందర్‌, ఎస్సై చంద్రశేఖర్‌ల తో కలిసి మొక్కలు నాటారు.  కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి వెంకయ్య, ఎం పీవో మిస్బాఅలం, పంచాయతీ కార్యదర్శి, టీఆర్‌ఎస్‌ నాయకులు ,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

పచ్చని చెట్ల్లు.. ప్రగతికి మెట్లు

దుబ్బాక: పచ్చని చెట్ల్లు ...గ్రామ ప్రగతికి మెట్లని  సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు తౌడ శ్రీనివాస్‌ అన్నారు.  మండలంలోని చీకోడ్‌లో  గ్రామ సర్పంచ్‌  శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గ్రామస్తులకు పండ్ల, పూల మొక్కలు పంపిణీ చేశారు.అనంత రం ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌లు  పాల్గొన్నారు.  

కోహెడలో....

కోహెడ: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి  సంరక్షించాలని  ఎంపీపీ కీర్తి అన్నారు.  మండలంలోని నకిరకొమ్ముల్లో సర్పంచ్‌ సతీష్‌ ఆధ్వర్యంలో ఎక్సైజ్‌ సిబ్బందితో కలిసి ఈత మొక్కలు నాటా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిసున్న  హరితహార కార్యక్రమాన్ని విజయవంత ం చేయాలన్నారు. అనంతరం డంపింగ్‌ యార్డును ప్రారంభించారు. గ్రామ నర్సరీని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ  శ్రీనివా స్‌, ఎంపీడీవో శ్రీధర్‌, ఎక్సైజ్‌ ఎస్సై సురేశ్‌  ఉన్నారు.

చేర్యాలలో..

చేర్యాల : సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన హరితహారం  రాష్ర్టానికి మణిహారంగా మారిందని చేర్యా ల రవాణాశాఖ యూనిట్‌ కార్యాలయ ఎంవీఐ జోసఫ్‌ అన్నారు.  రవాణాశాఖ కార్యాలయంలో 60 మంది లైసెన్స్‌ అభ్యర్థులకు ఆయన  మొ క్కలు పంపిణీ చేశారు. అనంతరం కార్యాలయ ఆవరణలో  మొక్కలు నాటారు. కార్యక్రమంలో కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ జనార్దన్‌రెడ్డి, పీసీ రవీందర్‌, రాకేశ్‌ పాల్గొన్నారు.

ఇంటింటికీ మొక్కల పంపిణీ

మద్దూరు: ప్రభుత్వం చేపట్టిన హరితయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్‌ బద్దిపడిగె లలిత అన్నారు మండలంలోని నర్సాయపల్లిలో  సర్పంచ్‌ ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్‌ ఎల్లయ్య,  పాల్గొన్నారు.

కొమురవెల్లిలో

కొమురవెల్లి : హరిత తెలంగాణ సీఎం కేసీఆర్‌ లక్ష్యమని ఎంపీపీ  కీర్తన అన్నారు.  కొమురవెల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద జడ్పీటీసీ సిద్ధప్పతో కలిసి మొక్కలు నాటా రు.  అనంతరం ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసిన ఎంపీపీ కీర్తనను ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, మం డల ప్రజాప్రతినిధులు ఘన ంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సిలువేరు సిద్ధ్దప్ప,  ఎంపీడీవో మల్లికార్జున్‌, వైస్‌ ఎంపీపీ రాజేందర్‌రెడ్డి, ఆయా గ్రా మాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పాల్గొన్నారు.


logo