సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 07, 2020 , 02:20:26

ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మృతి

ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మృతి

  • సంగారెడ్డి జిల్లాలో  కొత్తగా 9 పాజిటివ్‌ కేసులు నమోదు
  • రోజురోజుకూ పెరుగుతున్న కేసులు

సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లాలో కొత్తగా సోమవా రం 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ మోజీరాం రాథోడ్‌ తెలిపారు. జిల్లాలోని సంగారెడ్డి 1, బీడీఎల్‌ టౌన్‌షిప్‌ 2, కంది మండలం ఇరిగిపల్లి 1, కంది 1, సదాశివపేట 1, అమీన్‌పూర్‌ 2, సిర్గాపూర్‌ మండలం నల్లవాగు 1 మొత్తం 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు వెల్లడించారు. జిల్లాలో ముగ్గురు చికిత్స పొందుతూ మృతిచెందారు.  సంగారెడ్డి మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యురాలు గౌసియా బేగంగాంధీలోచికిత్స పొందింది. సదాశివపేట మండలం వెంకటాపూర్‌కు చెందిన మహిళ హైదరాబాద్‌లోని నల్లగుండ్ల సిటిజెన్‌ దవాఖానలో మృతిచెందగా, ఐడీఏ బొల్లారానికి చెందిన మహిళ గాంధీలో చికిత్స పొందుతూ మృతి చెందిందని అధికారులు తెలిపారు. 

కరోనాతో మహిళ మృతి..

బొల్లారం: మున్సిపాలిటీ పరిధిలోని వైఎస్‌ఆర్‌ కాలనీకి చెందిన మహిళ (38) అనారోగ్యంతో బాధపడుతూ నగరంలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందింది.  ఈ నేపథ్యంలో  ఆమెకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా, రిపోర్టుల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు  బొల్లారం ప్రాథమిక ఆరోగ్య అధికారి రాధిక తెలిపారు. 

అమీన్‌పూర్‌లో 2 కరోనా కేసులు 

అమీన్‌పూర్‌: మున్సిపల్‌ పరిధిలో మరో రెండు కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.  రూపశ్రీ కౌంటీ, సుప్రజ హోమ్స్‌లో ఒక్కో కేసు చొప్పు న మొత్తం 2 కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు చెప్పారు. మున్సిపల్‌ సిబ్బంది ఆయా కాలనీల్లో శానిటైజేషన్‌ చర్యలు చేపట్టారు. 

సుల్తానాబాద్‌లో ప్రైవేట్‌ వైద్యుడికి.. 

సిర్గాపూర్‌: మండలంలోని సుల్తానాబాద్‌కు చెందిన ప్రైవేట్‌ వైద్యుడికి (52) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. అప్రమత్తమైన అధి కారులు అతడిని గాంధీ దవాఖానకు తరలించారు. సిర్గాపూర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ అనిల్‌రెడ్డి, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌  మొగులయ్య సిబ్బందితో గ్రామాన్ని సందర్శించి పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లి విచారణ జరిపారు.  

సిద్దిపేటలో ఒకరికి.. 

సిద్దిపేట కలెక్టరేట్‌: సిద్దిపేట జిల్లా కేంద్రంలో  కరోనా పాజిటివ్‌ కేసు నమోదైందని జిల్లా కొవిడ్‌-19 నోడల్‌ అధికారి పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సిద్దిపేట భారత్‌ నగర్‌లోని ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధ్దారణ అయిం దన్నారు. ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించి హోం క్వారం టైన్‌కు తరలించామన్నారు. 

బండపోతుగల్‌లో ఓ వ్యక్తికి..  

చిలిపిచెడ్‌: మండలంలోని బండపోతుగల్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని మండల వైద్యాధికారి డా.వెంకటస్వామి తెలిపారు. ఆయనతో పాటు 20 మందిని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. అలాగే, కార్యదర్శి వెంకటేశ్వం పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.

తూప్రాన్‌లో మరో వ్యక్తికి.. 

తూప్రాన్‌ రూరల్‌: పట్టణంలో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తూప్రాన్‌ పీహెచ్‌సీ డాక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. వెల్దుర్తి మండలం మాసాయిపేటకు చెందిన ఓ వ్యక్తి జూన్‌ 20న దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడుతూ నగరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. అతడికి కరోనా పాజిటివ్‌గా తేలిందని వెద్యులు తెలిపారు. ఈ నెల 1వ తేదీన తూప్రాన్‌లో అతడి పెంపుడు తల్లి మృతిచెందగా, అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అంత్యక్రియలకు వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నారు.


logo