శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 07, 2020 , 02:20:25

రెండు నెలల్లో రైతు వేదికలు పూర్తి కావాలి

రెండు నెలల్లో రైతు వేదికలు పూర్తి కావాలి

సిద్దిపేట కలెక్టరేట్‌: జిల్లాలో రైతు వేదికల నిర్మాణ పనులు రెండు నెలల్లో పూర్తిచేయాలని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌, ఆర్డీవోలు అనంతరెడ్డి, జయచంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌ ఈఈ కనకరత్నం, డీఏవో శ్రావణ్‌, మైనింగ్‌ ఏడీతో కలిసి సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ క్లస్టర్ల వారీగా రైతువేదికలు, గ్రామాల్లో డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాల నిర్మాణానికి ఎంత మేర ఇసుర అవసరమనే దానిపై చర్చించారు. జిల్లాలో 126 రైతువేదికల కోసం నలుగురు కాంట్రాక్టర్లను నియమించామన్నారు. ఒక్కో రైతువేదికకు 4 లారీల ఇసుక అవసరమని నిర్ధారించి సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇసుక సరఫరా కోసం ఆర్డీవో, పంచాయతీరాజ్‌ ఈఈ, మైనింగ్‌ ఏడీను నియమించామన్నారు. ఆర్డీవోల పర్యవేక్షణలో ప్రతిరోజు 100 నుంచి 150లారీల ఇసుక సరఫరా చేస్తామన్నారు. రైతు వేదిక నిర్మాణానికి 500 బస్తాల సిమెంట్‌ అవసరమని, సిమెంట్‌ ధరను రూ.230 ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లాలో అవసరమైన మేర 74వేల సిమెంట్‌ బస్తా లు పంపేలా కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్‌ స్వయంగా మాట్లాడారు. రెండు రోజుల్లో సిమెంట్‌ అందేలా చూడాలని కంపెనీ ప్రతినిధులకు ఆదేశించారు. స్థల సమస్యలుంటే అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చి పరిష్కరిస్తారన్నారు. 

వారం రోజుల్లో మౌలిక వసతుల కల్పన 

డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంలో భాగంగా జిల్లాలోని ఆయా నియోజకవర్గాల పరిధిలో గల 3307 ఇం డ్లకు వారం రోజుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. సిద్దిపేటలో 664, దు బ్బాకలో 1004, కొమురవెల్లి- చేర్యాలలో 40, గజ్వేల్‌లో 1119, హుస్నాబాద్‌, మానకొండూరులో 480 చొప్పున ఇండ్లకు తాగునీరు, విద్యుత్‌, డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం ఐదు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. సమీక్షలో విద్యుత్‌ ఎస్‌ఈ కరుణాకర్‌, ఆర్‌అండ్‌బీ అధికారి సుదర్శన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ఎస్‌ఈ శ్రీనివాస్‌చారి, జడ్పీ సీఈవో శ్రావణ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ చరణ్‌దాస్‌, డీపీవో సురేశ్‌బాబు పాల్గొన్నారు. 

నిర్ణీత గడువులోగా డంపింగ్‌యార్డులు,  శ్మశానవాటికలు పూర్తి చేయాలి 

సిద్దిపేట నియోజకవర్గంలో గడువులోగా డంపింగ్‌యార్డు, వైకుంఠధామాలు నిర్మాణాలు పూర్తి చేయాలని  కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో సిద్దిపేట నియోజకవర్గంలోని మండలాల వారీగా డంపిం గ్‌యార్డు, వైకుంఠధామాల నిర్మాణ పనులపై అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డం పింగ్‌యార్డు, వైకుంఠధామాల నిర్మాణాల పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ రాజ్‌శాఖ అధికారులు పర్యవేక్షించాలన్నారు. పూర్తయిన డంపింగ్‌యార్డులను 10రోజుల్లో వినియోగంలోకి తేవాలని, లేకపోతే ఎంపీవోలు, సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు జారీ చేస్తామన్నారు.  నిర్మాణ పనుల్లో జాప్యం జరిగితే ఎంపీడీవో, ఎంపీవోలు బాధ్యులన్నారు. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో జడ్పీ సీఈవో శ్రావణ్‌, సిద్దిపేటకు డీపీవో సురేశ్‌బాబు, గజ్వేల్‌కు డీఆర్‌డీఏ గోపాల్‌రావు, దుబ్బాకకు అదనపు కలెక్టర్‌ ము జామ్మిల్‌ఖాన్‌ రోజువారీగా పర్యవేక్షిస్తారన్నారు. డం పిం గ్‌యార్డు, వైకుంఠధామాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండేలా నియోజకవర్గం వారీగా వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌కు కలెక్టర్‌ సూచించారు.    


logo