మంగళవారం 04 ఆగస్టు 2020
Siddipet - Jul 06, 2020 , 00:12:14

హరిత తెలంగాణే ప్రభుత్వ ధ్యేయం

హరిత తెలంగాణే ప్రభుత్వ ధ్యేయం

హుస్నాబాద్‌ :  హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలని జడ్పీ వైస్‌ చైర్మన్‌ రాయిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. పట్టణంలోని 19, 20వ వార్డుల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు మానవాళికి జీవనాధారమని, వాటిని నాటి సంరక్షించుకోవాలని సూచించారు. పట్టణంలో రికార్డు స్థాయిలో మొక్కలు నాటాలన్నారు. నేటి మొక్కలే రేపటి వృక్షాలై పర్యావరణాన్ని పరిరక్షిస్తాయని వివరించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎడబోయిన తిరుపతిరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ అయిలేని అనితారెడ్డి, కమిషనర్‌ రాజమల్లయ్య, కౌన్సిలర్లు బొజ్జ హరీశ్‌,  సుప్రజ నవీన్‌రావు, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్‌, నాయకులు బండి పుష్ప, అయూబ్‌, సతీశ్‌, భాస్కర్‌ పాల్గొన్నారు. 

హరిత తెలంగాణే ప్రభుత్వ ధ్యేయం

మద్దూరు : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నర్సాయపల్లి సర్పంచ్‌ బద్దిపడిగె లలిత అన్నారు.  హరితహారంలో భాగంగా ఆమె గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు. వల్లంపట్లలో సర్పంచ్‌ ఆలేటి రజిత ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌లు చింతల ఎల్లయ్య, కర్నె మనోహర్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

అవెన్యూ ప్లాంటేషన్‌పై 

శ్రద్ధ వహించాలి

చేర్యాల :  వేచరేణి గ్రామంలో ఎంపీడీవో రాంప్రసాద్‌ రోడ్లకు ఇరువైపులా(అవెన్యూ ప్లాంటేషన్‌) మొక్కలు నాటే కార్యక్రమాన్ని సర్పంచ్‌ ఏనుగుల దుర్గయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో, సర్పంచ్‌ మాట్లాడుతూ.. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని,  మొక్కలను ధ్వంసం చేస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఏనుగుల లక్ష్మీనర్సయ్య, ఉపాధిహామీ ఏపీవో మంజుల, కార్యదర్శి ప్రియదర్శిని, అంగన్‌వాడీలు, ఆశ వర్కర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.logo