గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 06, 2020 , 00:01:24

భౌతిక దూరం పాటిస్తూ మల్లన్న దర్శనం

 భౌతిక దూరం పాటిస్తూ మల్లన్న దర్శనం

చేర్యాల : కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి ఆదివారం పలు జిల్లాల నుంచి సుమారు రెండు వేల మంది భక్తులు తరలివచ్చినట్లు ఆలయవర్గాలు తెలిపాయి. మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు.  రాజగోపురంతో పాటు ఆలయ ప్రధాన వీదులు భక్తులతో కిటకిటలాడాయి. శానిటైజర్‌, థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతే లోనికి అనుమతించినట్లు  ఏఈవో గంగా శ్రీనివాస్‌, ఆలయ ప్రధాన అర్చకుడు మహాదేవుని మల్లికార్జున్‌, సూపరింటెండెంట్‌ నీల శేఖర్‌ తెలిపారు.


logo