గురువారం 13 ఆగస్టు 2020
Siddipet - Jul 05, 2020 , 00:58:06

హరితవనంగా మారుద్దాం

హరితవనంగా మారుద్దాం

  • మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు,అధికారులు

రామాయంపేట: రామాయంపేట మున్సిపాలిటీని హరితవనంగా మారుస్తామని చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌, రామాయంపేట ఎస్‌ఐ మహేందర్‌ అన్నారు. శనివారం పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌, వార్డుల్లో, రోడ్ల పక్కన మొక్కలు నాటి నీళ్లు పోశారు.  పట్టణ వాసులు మొక్కలను చంటిపిల్లల్లా కాపాడాలన్నారు.పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలన్నారు.  మున్సిపాలిటీని మనందరం కలిసి హరిత మయంగా చేద్దామని అన్నారు.   వైస్‌చైర్మన్‌ పుట్టి విజయలక్ష్మి, కమిషనర్‌ శేఖర్‌రెడ్డి, కౌన్సిలర్లు దేమె యాదగిరి, గజవాడ నాగరాజు, గంగాధర్‌  ఉన్నారు. 

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి

కొల్చారం: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని అడిషనల్‌ డీఆర్‌డీవో భీమయ్య అన్నారు. శనివారం కొల్చారం ఐకేపీ కార్యాలయ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నీళ్లు పోశారు.   ఎంపీడీవో వామనరావు, డీపీఎం ప్రకాశ్‌, ఏపీఎం సుసిల్వ, సీసీలు యాదగిరి, వెంకటేశం  పాల్గొన్నారు.   

 ప్రభుత్వ లక్ష్యాన్ని అధిగమించాలి

తూప్రాన్‌ రూరల్‌: మండలంలోని  గ్రామాల్లో మొక్కలు నాటి  సంరక్షించాలని ఎంపీపీ గడ్డిస్వప్నవెంకటేశ్‌ అన్నారు. తూప్రాన్‌ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎంపీడీవో అరుంధతి, ఎంపీవో రమేశ్‌, ఈజీఎస్‌ ఏపీవో సంతోశ్‌రెడ్డితో కలిసి శనివారం ఆమె మొక్కలు నాటారు. యావాపూర్‌లో సర్పంచ్‌ నర్సింహారెడ్డి, ఉపసర్పంచ్‌ యంజాల లక్ష్మీస్వామి, టీఆర్‌ఎస్‌ గ్రామ కమిటీ అధ్యక్షుడు పిట్ల సింహం ఆధ్వర్యంలో హరితహారం మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు.   కార్య క్రమంలో పంచాయతీ కార్యదర్శులు మహేందర్‌రెడ్డి, రంగమ్మ, సుధాకర్‌, శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, కల్యాణి, అన్నపూర్ణ, అరుణ, రాజేశ్‌, సమీనా  పాల్గొన్నారు

 పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి 

నర్సాపూర్‌:  ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు  కృషి చేయాలని  నర్సాపూర్‌ సీఐ నాగయ్య, ఎస్‌ఐ సత్యనారాయణ  అన్నారు.  నర్సాపూర్‌ పట్టణంలో పోలీస్టేషన్‌లో సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.      

 ప్రతి గ్రామంలో హరితోత్సవం...

చేగుంట: మొక్కలు నాటే కార్యక్రమం హరితోత్సవంగా కొనసాగుతున్నదని చేగుంట ఎంపీడీవో ఉమాదేవి తెలిపారు. చేగుంటలో ఇతర రాష్టాల నుంచి తెచ్చిన  70 వేల మొక్కలను  పంచాయతీ కార్యదర్శులకు అందజేశారు.  

మొక్కలను రక్షించాలి

నిజాంపేట: మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని జెడ్చెరువు తండా సర్పంచ్‌ అరుణ్‌ కుమార్‌ అన్నారు.   గ్రామస్తులతో కలిసి పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటి వాటికి ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు.  


logo