సోమవారం 03 ఆగస్టు 2020
Siddipet - Jul 05, 2020 , 00:58:26

దుబ్బాకను ఆదర్శంగా నిలుపుదాం

దుబ్బాకను ఆదర్శంగా నిలుపుదాం

  • రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి

దుబ్బాక టౌన్‌ : హరితహారం కార్యక్రమంలో భాగంగా దుబ్బాక మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుదామని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. శనివారం దుబ్బాక మున్సిపల్‌ పరిధిలోని దుంపలపల్లి 4, 5 వార్డుల్లో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గన్నె వనిత, వైస్‌ చైర్‌ పర్సన్‌ అధికం సుగుణ బాలకిషన్‌గౌడ్‌, కౌన్సిలర్‌ ఇల్లందుల శ్రీనివాస్‌లతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. అనంతరం రూ. 5 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో 1.78 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రూ. 20 లక్షలతో దుబ్బాక పట్టణంతో పాటు లచ్చపేట, చెల్లాపూర్‌, దుంపలపల్లి, ధర్మాజిపేట వార్డుల్లో ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు.  

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత...

దుబ్బాక మున్సిపల్‌ పరిధిలోని 5వ వార్డుకు చెందిన మద్ది భారతమ్మ అనారోగ్యంతో ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందటంతో ఆమెకు సీఎంఆర్‌ఎఫ్‌ కింద మంజూరైన రూ. 24 వేల చెక్కును ఎమ్మెల్యే రామలింగారెడ్డి అందజేశారు.  

ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ గోల్కొండ నర్సయ్య, ఉమ్మడి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ గనుప లక్ష్మారెడ్డి, పెద్దగుండవెల్లి సర్పంచ్‌ సద్ది రాజిరెడ్డి, కౌన్సిలర్‌ యాదగిరి, ఎస్సై స్వామి, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆస స్వామి, పర్స కృష్ణ, గన్నె నరేందర్‌రెడ్డి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. logo