సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 04, 2020 , 02:47:03

తల్లిదండ్రుల చెంతకు తప్పిపోయిన పిల్లలు

తల్లిదండ్రుల చెంతకు తప్పిపోయిన పిల్లలు

చేగుంట: తప్పిపోయిన ఇద్దరు పిల్లలను చేగుంట పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. చేగుంట పోలీసుల వివరాల ప్రకారం.. బీహార్ చెందిన ఈలబా బు- పాస్వాని దంపతులకు కొడుకు రజినిశ్, కుతూరు అనిష్కా ఉన్నారు. దంపతులు చేగుంటలోని ఓ పరిశ్రమంలో పని చేస్తున్నారు. శుక్రవారం తండ్రి ఈలబాబు ఇంట్లో పడుకోగా, తల్లి మార్కెట్ వెళ్లగా, ఇద్దరు పిల్లలు ఆమె వెనుక వెం బడించారు. ఇది గమనించకుండా తల్లి మార్కెట్ వెళ్లిపోయింది. చేగుంట బ్రిడ్జి వద్ద నాలుగు దిక్కుల రోడ్డు రావడంతో పిల్లలు ఎక్కడికి వెళ్లాలో తెలియక అక్క డే ఏడుస్తూ నిల్చున్నారు. స్థానికులు గమనించి, పోలీసులకు అప్పగించారు. పిల్లల కోసం తల్లిదండ్రులు వెతుకుతుండగా, స్థానికులు పోలీస్ వెళ్లాలని చెప్పారు. ఠాణాకు వెళ్లగా, పోలీసులు పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించారు.logo