శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 04, 2020 , 02:47:09

పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం

పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం

సిద్దిపేట అర్బన్‌ : కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ శుభ్రత పాటించాలని పొన్నాల సర్పంచ్‌ రేణుకాశ్రీనివాస్‌ అన్నారు. గ్రామంలో శుక్రవారం డ్రై డే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి దోమల వృద్ధికి కారణమవుతున్న నీటి నిల్వలు తొలిగించారు. శుభ్రతతోనే వ్యాధులు ధరిచేరవని, పరిసరాల పరిశుభ్రత పా టించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీవో నర్సింగ్‌రావు ఉన్నారు. 

సిద్దిపేట రూరల్‌ : మండలంలోని పుల్లూరులో డ్రైడే పనులు చేపట్టారు. ఈ సందర్భంగా నిల్వ నీటిని తొలిగించారు. సీజనల్‌ వ్యాధులు వ్యాపించకుండా ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ పాలకవర్గం సభ్యులు, ఆశ వర్కర్లు వివరించారు

గజ్వేల్‌ రూరల్‌ : మండలంలోని జాలిగామలో డ్రై డే కార్య క్రమా లు చేపట్టారు. సర్పంచ్‌ శివయ్య, కార్యదర్శి గోపర్తి సతీశ్‌ గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయా ఇండ్లలోని నిల్వ నీటిని తొలిగించారు. అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. 

నారాయణరావుపేట : మండలవ్యాప్తంగా డ్రై డే పనులు చేపట్టా రు. నారాయణరావుపేట, జక్కాపూర్‌, లక్ష్మీదేవిపల్లి, గుర్రాలగొంది, గోపులాపూర్‌, మాటిండ్ల గ్రామాల్లో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో నీటి నిల్వలు తొలగించారు. సీజనల్‌ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.


logo