శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 04, 2020 , 02:47:10

ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలి

 ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలి

  జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ చరణ్‌దాస్‌

  మొక్కల పెంపకంపై శ్రద్ధ చూపాలి

  డీఆర్డీవో పీడీ గోపాల్‌రావు

సిద్దిపేట అర్బన్‌ : హరితహారంలో ప్రతి ఒక్కరూ ఉద్యమస్ఫూర్తితో ముందుకు సాగాలని జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ, స్పెషల్‌ ఆఫీసర్‌ చరణ్‌దాస్‌ సూచించారు. మందపల్లి లో శుక్రవారం సర్పంచ్‌ కొమ్ము రాజయ్యతో కలిసి గ్రామస్తులకు పూలు, పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. పొన్నాల, ఎల్లుపల్లి, తడ్కపల్లి గ్రామాల్లో మొక్కలను పంపిణీ చేశారు. మందపల్లిలో ఆయన మాట్లాడుతూ.. మానవ మనుగడకు చెట్లు మూలాధారమని, ప్రతిఒక్కరూ మొక్కలు నాటి, రక్షించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రేణుకాశ్రీనివాస్‌, జయశ్రీరమేశ్‌, మంగభాస్కర్‌గౌడ్‌, ఎంపీటీసీలు శ్రీనివాస్‌గౌడ్‌, ఉప సర్పంచ్‌లు కేకే రావు, దుబ్బాక రవి, స్థానిక నాయకుడు సంపత్‌యాదవ్‌ పాల్గొన్నారు.

  లక్ష్యానికి మించి మొక్కలు నాటాలి

గజ్వేల్‌ రూరల్‌ : నాటే ప్రతి మొక్కను బతికించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రత్యేకాధికారి, డీఆర్డీవో పీడీ గోపాల్‌రావు అన్నారు. మండలంలోని అక్కారం, దాతర్‌పల్లి, శ్రీగిరిపల్లి గ్రామాల్లో హరితహారం మొక్కలు, అవెన్యూప్లాంటేషన్‌, డం పింగ్‌ యార్డు, వైకుంఠధామాల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని గ్రామాల్లో లక్ష్యానికి మించి మొక్కలను నాటాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో దామోదర్‌రెడ్డి, కార్యదర్శి సతీశ్‌ ఉన్నారు.

 పెద్దలింగారెడ్డిపల్లిలో భారీగా మొక్కల పెంపకం 

సిద్దిపేట రూరల్‌ : మండలంలోని పెద్దలింగారెడ్డిపల్లిలో సర్పంచ్‌ ఉదయశ్రీ తిరుపతి, రైతుబంధు మండల కో ఆర్డినేటర్‌ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన రహదారి నుంచి పల్లెకుంట చెరువు వరకు 600 మొక్కలు నాటారు. అలాగే, పుల్లూరులో సర్పంచ్‌ పల్లె నరేశ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీవో అరవింద్‌, పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి, సిబ్బంది పాల్గొన్నారు. 

 విఠలాపూర్‌లో అవెన్యూ ప్లాంటేషన్‌

చిన్నకోడూరు : మండలంలోని విఠలాపూర్‌లో రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్‌లో మొక్కలను నాటారు. అనంతరం ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా సర్పంచ్‌ మద్దికుంట నవీన్‌  మాట్లాడుతూ.. హరితహారాన్ని ప్రజలందరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. 

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి 

నంగునూరు : మండలకేంద్రంలో సర్పంచ్‌ మమత ఆధ్వర్యంలో సిద్దన్నపేట స్టేజీ రోడ్డు వెంబడి మొక్కలు నాటారు.  ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు.  

 ఇంటింటికీ మొక్కల పంపిణీ

కొండపాక : మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. మర్పడగ, మాత్‌పల్లి గ్రామాల్లో సర్పంచ్‌లు రజిత, మైపాల్‌ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికీ ఐదు మొక్కలను పంపిణీ చేశారు.  

పచ్చని చెట్లతో ఆరోగ్యం పదిలం.. 

జగదేవ్‌పూర్‌ : పచ్చని చెట్లు.. ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని సర్పంచ్‌ పిట్టల రాజు అన్నారు. హరితహారంలో భాగంగా ధర్మారంలో ఇంటింటికీ ఐదు మొక్కల చొప్పున పంపిణీ చేశారు. 


logo