శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 04, 2020 , 02:47:18

‘డబుల్‌' ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచండి

‘డబుల్‌' ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచండి

  • n లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా పూర్తి చేయండి
  • n గ్రామస్తులందరి సమక్షంలోనే లబ్ధిదారుల ఎంపిక
  • n సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి
  • n గజ్వేల్‌లో సర్పంచులు, అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష

గజ్వేల్‌ అర్బన్‌ :  డబుల్‌బెడ్‌రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేయాలని సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గజ్వేల్‌ ఐవోసీలోని గడా సమావేశ మందిరంలో డివిజన్‌లోని డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. దీనికి గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, డీఈ రాంచంద్రం, గ్రామాల సర్పంచ్‌లు, మండల అధికారులు, కాంట్రాక్టర్లు హాజరయ్యారు. గ్రామాల వారీగా ఇండ్ల నిర్మాణాల ప్రగతిని తెలుసుకున్నారు. వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. పనుల్లో అలసత్వం వహించొద్దని, నాణ్యతాప్రమాణాలతో పూర్తి చేయాలన్నారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలని, ఎంపిక చేసిన గ్రామాల్లో నిర్మించిన ఇండ్లకు పేదలు, అర్హులను ఎంపిక చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తహసీల్దార్లకు, సర్పంచ్‌లకు సూచించారు. 

గ్రామస్తుల సమక్షంలో ఎంపిక ప్రక్రియ

డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపికను జాగ్రత్తగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సూచించారు. పంచాయతీ వద్ద వారం రోజుల పాటు దరఖాస్తుల పెట్టెను ఏర్పాటు చేయాలన్నారు. వారం తర్వాత దరఖాస్తులను సర్పంచ్‌, గ్రామపెద్దలు, గ్రామస్తుల సమక్షంలో చదివి, వారు అర్హులా? కాదా? అనేది గ్రామస్తుల ముందే నిర్ధారించి, ప్రత్యేక సంఖ్యను కేటాయించాలన్నారు. నిర్మించిన ఇండ్ల కంటే ఎక్కువ దరఖాస్తు లు వస్తే, లాటరీ పద్ధతి అవలంబించాలన్నారు. ప్ర భుత్వం తిరిగి ఆ గ్రామానికి డబుల్‌బెడ్‌రూం ఇం డ్ల మంజూరు చేసినప్పుడు మిగిలిన వారికి మొ దటి ప్రాధాన్యం ఇస్తారన్న విషయాన్ని చెప్పాలన్నారు. ఎంపిక బాధ్యతలను గడా ప్రత్యేక అధి కారి ముత్యంరెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, తహసీల్దార్లకు అప్పగించారు.

రెండు నెలల్లో పూర్తి చేయాలి

గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న గ్రామాల్లో నిర్మిస్తున్న ఇండ్లను రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలని అధికారులు, కంట్రాక్టర్లకు ఆదేశిం చారు. ఇండ్లకు అవసరమైన నల్లా కనెక్షన్లు, తాగునీటి సౌకర్యం, రోడ్లు, విద్యుత్‌ తదితర పనుల వి వరాలను తెలుసుకున్నారు. ప్రారంభించిన నిర్మా ణ పనులన్నీ రెండు నెలల్లో పూర్తి చేయాలన్నారు.

ఎర్రవల్లి, నర్సన్నపేటలో ఐదేండ్లయినా చెక్కు చెదరలేదు..

అత్యాధునిక పరిజ్ఞానంతో సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఐదేండ్లయినా చెక్కు చెదరలేదని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఐవోసీలో ఇరు గ్రామాల ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన కంట్రాక్టర్‌ బాపినీడు, డీఈఈ రామచంద్రంను గ్రామస్తులు, కలెక్టర్‌ అభినందించారు. తమ గ్రామాన్ని చూడడానికి ప్రముఖులు రావడం సంతోషాన్ని కలిగిస్తున్నదని గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. గ్రామాలను మరింత అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. గ్రామంలో పైపులైన్లు, మురికి కాల్వలు, దేవాలయం, గ్రంథాలయం, మహిళా, యూత్‌ భవనం, మినీ ఫంక్షన్‌హాలు, మరికొన్ని ఇండ్ల నిర్మాణాలతో పాటు పలు విషయాల గురించి కలెక్టర్‌తో చర్చించారు. దీనికి కలెక్టర్‌ సానుకూలంగా స్పందిస్తూ.. కొద్దిరోజుల్లోనే గ్రామానికి వచ్చి, ఒక రోజు మొత్తం గ్రామంలోనే ఉంటానని, సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి అన్ని పనులను సంపూర్ణంగా పూర్తి చేసుకుందామని హామీ ఇచ్చారు. డ్రిప్‌ ఇరిగేషన్‌ సిస్టమ్‌ను పెద్దఎత్తున తీసుకురావాలని, కూరగాయల పంటల సాగుకు మరిన్ని నూతన సంస్కరణలు తీసుకురానున్నట్లు సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలిపారు. కాగా, గ్రామస్తుల కోరిక మేరకు ఎర్రవల్లికి 10, నర్సన్నపేటకు 25 డబుల్‌బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేస్తున్నామని, ఇందుకు కావాల్సిన నివేదికలను రూపొందించాలని డీఈఈని ఆదేశించారు.logo