గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 03, 2020 , 02:57:58

మొక్కలు నాటి, సంరక్షించాలి

మొక్కలు నాటి, సంరక్షించాలి

  •  ఏసీపీ రామేశ్వర్‌, మున్సిపల్‌ చైర్మన్‌  రాజనర్సు

సిద్దిపేట టౌన్‌ : మొక్కలు నాటడమే కాకుండా సం రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఏసీపీ రామేశ్వర్‌, మున్సిపల్‌ చైర్మన్‌  రాజనర్సు అన్నారు.  హరితహారంలో భాగంగా సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో 25 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భవిష్యత్‌ తరాల కోసం మొక్కలు నా టాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొ క్కలు నాటి, సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐ సైదులు, ఎస్సైలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

హరితహారంలో భాగస్వాములు కావాలి

సిద్దిపేట అర్బన్‌ : హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కా వాలని మిట్టపల్లి సర్పంచ్‌ వంగ లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు. మిట్టపల్లిలో ఇంటింటికీ పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. అలాగే, ఖాళీ ప్రదేశాల్లో గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కనూ రక్షించే బాధ్యతను స్వచ్ఛందంగా తీసుకోవాలని కోరారు. అనంతరం మురుగు నీటి కాల్వల నిర్మాణ పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ తిరుపతి, మాజీ చైర్మన్‌ ప్రవీణ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతలు చింతలకుమార్‌,  ఎండీ ఫయాజుద్దీన్‌, గోవిదారం మహేందర్‌ పాల్గొన్నారు.

మొక్కల సంరక్షణతోనే పర్యావరణానికి మేలు...

జగదేవ్‌పూర్‌ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎంపీపీ బాలేశంగౌడ్‌ అన్నారు. హరితహారంలో భాగంగా  జవదేవ్‌పూర్‌లో సర్పంచ్‌ లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డితో కలిసి గ్రామస్తులకు మొక్క లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. హోమ్‌స్టీడ్‌ ప్లాంటేషన్‌లో భాగం గా ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కవిత, ఈవో నరేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ మల్లేశం, కోఆప్షన్‌ సభ్యుడు శ్రీనివాసరావు, నేతలు రాము, రాజు పాల్గొన్నారు.

ఇంటింటికీ మొక్కల పంపిణీ

మర్కూక్‌ : మండలకేంద్రంలో ఇంటింటికీ మొక్కలను సర్పంచ్‌ అచ్చంగారి భాస్కర్‌ పంపిణీ చేశారు. హరితహారంలో భాగంగా ప్రజలు కోరిన జామ, దానిమ్మ, మా మిడి, బత్తాయి తదితర మొక్కలను అందజేశారు. నాటిన మొక్కలను జాగ్రత్తగా పెంచాలని సర్పంచ్‌ సూచించారు. 


logo