శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 03, 2020 , 02:58:07

దుద్దెడ జంక్షన్‌ అభివృద్ధి పనుల వేగం పెంచాలి

దుద్దెడ జంక్షన్‌ అభివృద్ధి పనుల వేగం పెంచాలి

  • సమీక్షలో మంత్రి తన్నీరు హరీశ్‌ రావు 

సిద్దిపేట కలెక్టరేట్‌ : సిద్దిపేట కలెక్టర్‌ కార్యాలయ పనులు పూర్తయ్యాయని, త్వరలో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించనున్న నేపథ్యంలో దుద్దెడ జంక్షన్‌ నిర్మాణ పనుల వేగం పెంచాలని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో అధికారులతో రాజీవ్‌ రహదారిపై  మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ దుద్దెడ జంక్షన్‌ అభివృద్ధి పనులు రూ.8.5 కోట్లతో జరుగుతున్నాయని, నాలుగు లేన్ల రోడ్డు, డివైడర్‌, ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేపట్టాలని  అధికారులకు సూచించారు.  సిద్దిపేట పొన్నాల వద్ద ఫ్లైఓవర్‌ పనుల పురోగతిపై సమీక్షించి, అవసరమైన నిధుల సమీకరణకు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు . రోడ్డు విస్తరణకు దుద్దెడ వద్ద విద్యుత్‌ స్తంభాలు అడ్డు వస్తున్నాయని అధికారులు తెలుపడంతో, వెంటనే ఎస్‌ఈ కరుణాకర్‌బాబుకు ఫోన్‌ చేసి వాటిని తొలగించాలని మంత్రి ఆదేశించారు. జంక్షన్ల పరిధిలో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. నర్సపురం జంక్షన్‌లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అక్కడ సర్వీసు రోడ్డు, సెంటర్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు.  సమీక్షలో ఈఎన్‌సీ ఆశారాణి, ఎన్‌హెచ్‌ఏ అధికారులు పాల్గొన్నారు. 


logo