బుధవారం 12 ఆగస్టు 2020
Siddipet - Jul 02, 2020 , 03:41:49

ఊరూరా హరిత పండుగ

ఊరూరా హరిత పండుగ

  •     n హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
  •    n జడ్పీ సీఈవో శ్రవణ్
  •    n పల్లెలన్నీ హరిత వనాలుగా మారాలి
  •    n మున్సిపల్ చైర్ రజిత, స్వరూపరాణి
  •     n హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
  •    n జడ్పీ సీఈవో శ్రవణ్
  •    n పల్లెలన్నీ హరిత వనాలుగా మారాలి
  •    n మున్సిపల్ చైర్ రజిత, స్వరూపరాణి

 కోహెడ : పర్యావరణ పరిరక్షణకు సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకం గా అమలు చేస్తున్న హరితహారంపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని జడ్పీ సీఈవో శ్రవణ్ అన్నారు. బుధవారం బస్వాపూర్ ఎంపీపీ కొక్కుల కీర్తి, కోహెడలో పీఏసీఎస్ చైర్మన్ పేర్యాల దేవేందర్ సర్పంచ్ పేర్యాల నవ్యతో కలిసి గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం.. ఆరెపల్లి, బత్తులవానిపల్లి,  ధర్మసాగర్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. బస్వాపూర్, కోహెడలో గ్రామ ప్రకృతి వనం నిర్మాణాలకు స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. మొక్కలను నాటి సంరక్షిస్తే పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినవారవుతారన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీటీసీ స్వరూప, ఎంపీడీవో శ్రీధర్, సర్పంచ్ సత్తయ్య, లక్ష్మి, సుజాత, కార్యదర్శి రవీందర్ ఉన్నారు.

పర్యావరణాన్ని కాపాడాలి : ఏసీపీ మహేందర్

మొక్కలను నాటి సంరక్షిస్తే అవి మనలను రక్షిస్తాయని హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ అన్నారు. కోహెడ పోలీస్ సీఐ రఘు, సింగిల్ విండో చైర్మన్ దేవేందర్ కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. వృక్షాలు మనుషులను కన్నతల్లిలా కాపాడుతాయన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో  ఎస్సై రాజ్ నేతలు మాధవరావు, నరేందర్ వెంకటేశం,  శ్రీకాంత్, కార్యదర్శి రవి, కారోబార్ అనిల్ పాల్గొన్నారు.

గుండారెడ్డిపల్లిలో మొక్కల పంపిణీ

కోహెడ మండలంలోని గుండారెడ్డిపల్లిలో ఇంటింటికీ 6 మొక్కలను సర్పంచ్ ఓరుగంటి అశోక్ పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో మొక్కలను నాటి సంరక్షించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సుతారి కల్యాణి, వార్డు సభ్యు లు యాదగిరి, శేఖర్, శాంతవ్వ, ఐలవ్వ, సరవ్వ పాల్గొన్నారు.

నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి 

హుస్నాబాద్ : పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో  హరితహారం పండుగలా జరుగుతుంది. పట్టణంలోని 18వ వార్డు లో మున్సిపల్ చైర్ ఆకుల రజిత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలను మనం కాపాడితే అవి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ అనితారెడ్డి, కమిషనర్ రాజమల్లయ్య, కౌన్సిలర్ రమేశ్, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, శానిటరీ ఇన్ ప్రణీత, నాయకులు వాల నవీన్ సతీశ్, విజయభాస్కర్ పాల్గొన్నారు. 

 డంపింగ్ షెడ్ నిర్మాణ పనులు పరిశీలించిన ఎంపీడీవో

హుస్నాబాద్ రూరల్ : మండలంలోని జిల్లెలగడ్డలో డంపింగ్ షెడ్ నిర్మాణ పనులను ఎంపీడీవో అనిత పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే హరితహారం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో రికార్డులు పరిశీలించి గ్రామాభివృద్ధికి  సూచనలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వరూప, ఏపీవో రంగనాయక్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఉన్నారు. 

  మొక్కలను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు 

చేర్యాల : మొక్కలను ఎవరైనా ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్ స్వరూపరాణి అన్నారు. మున్సిపల్ 6వ వార్డులో ప్రజలకు కౌన్సిలర్ కనకమ్మయాదగిరితో కలిసి మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హరితహారంలో నాటిన ప్రతి మొక్కను రక్షించేందుకు చర్య లు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్  రాజీవ్ కౌన్సిలర్లు నరేందర్, సతీశ్, నేతలు శ్రీధర్ భిక్షపతి ఉన్నారు.

ఇంటింటికీ పండ్ల మొక్కల పంపిణీ

దౌల్తాబాద్ : నాటిన ప్రతి మొక్కను కాపాడాలని సర్పంచ్ వెంకన్న, స్వామి అన్నారు. దౌల్తాబాద్ కోనాపూర్ గ్రామం లో  ఇంటింటికీ పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ప్రతి ఇంట్లో మొక్కలను నాటితే ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఆయా కార్యక్ర మాల్లో మండల ప్రత్యేకాధికారి వెంకయ్య, ఎంపీవో మిస్బా అలం, టీఆర్ నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


logo