బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 02, 2020 , 03:41:50

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

  • -  రైతు వేదిక భవన నిర్మాణాలకు   శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యేలు 
  • -  వేదికల ద్వారా వ్యవసాయోత్పత్తులు   పెరిగి రైతుకు లబ్ధి

పెద్దశంకరంపేట: రైతును రాజును చేయడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా రని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్ అన్నారు.   పెద్దశంకరంపేట మండలంలో జాయింట్ కలెక్టర్ నగేశ్ కలిసి  పెద్దశంకరంపేట, శివ యపల్లి, రామోజిపల్లి గ్రామాల్లో రైతువేదిక భవన నిర్మా ణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రైతుబంధు, రైతుభీమా పథకాలతో పాటు రైతువేదిక భవనాలకు రూ.20 లక్షలు వెచ్చిస్తూ పంటల సాగులో నియంత్రిత సాగును సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు. రైతువేదిక భవనాల నిర్మాణం దసరా పండుగలోపు పూర్తయితాయన్నారు. 

స్వచ్ఛ గ్రామాలే లక్ష్యం

స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని గ్రామాల్లో డం పింగ్ యార్డులు ఏర్పాటు చేస్తున్నదని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నగేశ్  అన్నారు. మండల పరిధి లోని ఇస్కపాయల తండా, లక్ష్మాపురం, భూర్గుపల్లి, మూసాపేట, దానంపల్లి, శివయపల్లి, చీలపల్లి, జంలా నాయక్ తండాల్లో డంపింగ్ యార్డులకు ప్రారంభోత్సవం చేసి వానపాములు విడుదల చేశారు. హరిత హారం పథకం కింద మొక్కలు నాటారు. చీలపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.

కోటమ్మ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

మండల పరిధిలోని భూర్గుపల్లి గ్రామంలో కోటమ్మ ఆల యంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో రూ.10.50 లక్షలతో నిర్మించిన వైకుంఠదా మానికి  ప్రారంభోత్సవం చేశారు.  

రేగోడ్ మండలంలో...

రేగోడ్: రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నదని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. మండల పరిధిలోని ఆర్.ఇటిక్యాల వద్ద నిర్మించిన డంపింగ్ యార్డును  ప్రారంభించిన అనంతరం రైతు వేదిక నిర్మాణానికి ఆయన భూమి పూజచేశారు. ప్రభుత్వం అందిస్తున్న చేయూతను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీటీసీ యాదగిరి రేగోడ్ మం డలాన్ని సంగారెడ్డి జిల్లాలో చేర్చాలని కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, వ్యవసాయాధికారి రాంప్రసాద్, వట్ మార్కెట్ కమిటీ చైర్మన్ రజనీకాంత్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్,  నాయకులు పాల్గొన్నారు. 

టేక్మాల్ మండలంలో...

టేక్మాల్: మండల పరిధిలోని కుసంగి గ్రామంలో రూ. 22 లక్షల వ్యయంతో నిర్మించనున్న రైతు వేదికకు అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ భూమి పూజ చేశారు. రైతుల సం ఘటితం కోసం, సమస్యలను చర్చించేందుకు ఈ వేదిక దోహదపడుతుందన్నారు.  

అల్లాదుర్గం మండలంలో...

అల్లాదుర్గం: రైతు శ్రేయస్సు కోసమే ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తున్నదని  ఎమ్మెల్యే  క్రాంతికిరణ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని ముస్లాపూర్ రూ.22 లక్షలతో నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. 

మొగుడంపల్లి మండలంలో...

జహీరాబాద్ : రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టి అభివృద్ధికి కృషి చేస్తున్నదని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ అన్నారు. బుధవారం మొగుడంపల్లి మండలంలోని మాన్నాపూర్ గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. రైతులు కొత్త పద్ధతిలో పంటలు సాగు చేసి అధిక లాభాలు సాధించేందుకు రైతు వేదిక భవనాలు ఎంతో మేలు చేస్తాయన్నారు. ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్  సర్పంచు ఈశ్వర్ టీఆర్ నాయకులు మోహన్ గ్రామ పెద్ద గుండరెడ్డి ఉన్నారు. 

ఝరాసంఘం, కొప్పాడలో...

ఝరాసంగం:  సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని ఎమ్మెల్యే కొనింటి మాణికర్ అన్నారు.  ఝరాసంగంతో పాటు కప్పాడ్ గ్రామంలో రైతువేదిక నిర్మాణ పనుల కోసం భూమిపూజ చేశారు.  ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ. 1.60 కోట్లతో ఎనిమిది క్లస్టర్లలో రైతు వేదిక భవనాలను నిర్మిస్తున్నామన్నారు.  ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపూర్ శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాల్గొన్నారు. 

నర్సాపూర్ పట్టణంలో...

నర్సాపూర్: రైతు సంక్షేమం కోసం టీఆర్ ప్రభుత్వం  పనిచేస్తున్నదని  ఎమ్మెల్యే చిలుముల మదన్ అన్నారు. బుధవారం   నర్సాపూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం సమీపంలో రైతువేదిక భవనం నిర్మాణం కోసం ఎమ్మెల్యే మదన్ భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ  ప్రభుత్వం నిర్మిస్తున్న రైతువేదికలు అన్నదాతలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నా రు.  ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్,  మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్,  జడ్పీటీసీ బాబ్యానాయక్, ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్,  డివిజన్ వ్యవసాయ అధికారి సురేఖ పాల్గొన్నారు.

రైతు సమస్యల పరిష్కారానికి వేదికలు

నర్సాపూర్ రూరల్: రైతు సమస్యల పరిష్కారానికి రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మదన్ పేర్కొన్నారు.  మండల పరిధిలోని ఆవంచ, లింగాపూర్, ఇబ్రహీంబాద్, రెడ్డిపల్లి గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణాలకు ఎమ్మెల్యే మదన్ భూమిపూజలు చేశారు.  ఎమ్మెల్యే మదన్ మాట్లాడుతూ 5 వేల ఎకరాల రైతులను ఓ క్లస్టర్ గుర్తించి రైతు వేదికలను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఈ భవనంలో రైతులు  కలిసి మాట్లాడుకు నేందుకు సమావేశ మందిరం అలాగే ఏఈవో కార్యాలయం ఉంటుందని తెలిపారు.   రైతులకు ఏవైనా సమస్యలు, సందేహాలున్నా ఏఈవో నివృత్తి చేస్తారని తెలిపారు. ఈ వేదికల ద్వారా రైతులలో సంఘటితం పెరిగి వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయని తద్వారా రైతులకు లాభం చేకూరుతుందని వెల్లడించారు.  ఆవంచ సర్పంచ్ కరుణాకర్,  వైస్ ఎంపీపీ నర్సింగరావు,  టీఆర్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. 

రైతులలో సంఘటితం పెరుగుతుంది

కౌడిపల్లి: రైతు వేదికలతో సంఘటితం పెరుగుతుందని కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు.  మండల పరిధిలోని మహ్మద్ రైతు వేదిక స్థలానికి కలెక్టర్ ధర్మారెడ్డి భూమి పూజ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతు వేదికల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వాన కాలం సీజన్ రైతులకు విత్త నాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. కౌడిపల్లి మం డల కేంద్రంలో వైకుంఠధామం, డంపింగ్ యార్డుల నిర్మాణాలకు స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డీపీవో హనోక్, ఇన్ ఎంపీడీవో రాణి, తహసీల్దార్ రాణాప్రతాప్, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి,  సర్పంచ్ దివ్యమహిపాల్ పాల్గొన్నారు.


logo