బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 01, 2020 , 03:28:49

అన్ని వార్డుల్లో స్టీల్‌ బ్యాంకులు

అన్ని వార్డుల్లో స్టీల్‌ బ్యాంకులు

  • n వీధి వ్యాపారుల గుర్తింపు పూర్తి చేయాలి
  • n మున్సిపల్‌ సమావేశంలో చైర్మన్‌ రాజనర్సు 

 సిద్దిపేట కలెక్టరేట్‌ : పట్టణంలోని వీధివ్యాపారుల గుర్తింపు ప్రక్రియ త్వరగా పూర్తి చేసి ఎక్కువ మంది లబ్ధి పొందేలా చూడాలని మున్సిపల్‌ చైర్మన్‌  రాజనర్సు అన్నారు. మంగళవారం మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్‌ రాజనర్సు మాట్లాడుతూ.. ఆత్మనిర్బర్‌ పథకం ద్వారా చిరు, వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రూ.10 వేలు ఇస్తారని, వాటిని వ్యా పార అభివృద్ధికి ఉపయోగించుకోవాలన్నారు. మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో మున్సిపల్‌ పరిధిలోని 34 వార్డుల్లో స్టీల్‌ బ్యాంకులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పటికే 14 వార్డుల్లో స్టీల్‌ బ్యాంకులను ఏర్పాటు చేశామని, మిగతా 20 వార్డుల్లో త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. ప్లాస్టిక్‌ నిషేధంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న స్టీల్‌ బ్యాంకుల ఏర్పాటు కు షెటర్లు, భవనాలను పరిశీలించాలని కౌన్సిలర్లను కోరారు. వీటి ని ర్వాహణ ఆర్పీలు చూస్తారని, వారికి ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు. సమావేశంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ఆక్తర్‌ పటేల్‌, డీఈ లక్ష్మణ్‌, కౌన్సిలర్లు బర్ల మల్లికార్జున్‌, వెంకట్‌గౌడ్‌, మల్యాల ప్రశాంత్‌, ప్రవీణ్‌, శ్రీనివాస్‌ యాదవ్‌, బూర శ్రీనివాస్‌, వజీర్‌, మోయిజ్‌, జావీద్‌, గ్యాదరి రవీందర్‌, చిప్ప ప్రభాకర్‌, ఉమారాణి ఐలయ్య, జ్యోతీరాజ్‌నరేందర్‌, ఉమారాణీశ్రీనివాస్‌, విజయలక్ష్మీనరేందర్‌, ధర్మవరం స్వప్నబ్రహ్మం, మంజులానర్సింహులు, లక్ష్మీసత్యనారాయణ, భవానీశ్రీనివాస్‌గౌడ్‌, దీప్తినాగరాజ్‌, కంటెం లక్ష్మీరాజు, అధికారులు పాల్గొన్నారు. 


logo