సోమవారం 06 జూలై 2020
Siddipet - Jun 30, 2020 , 02:36:09

ముంపు బాధితులను ఆదుకుంటాం

ముంపు బాధితులను ఆదుకుంటాం

తొగుట: మల్లన్న సాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురైన బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని తహసీల్దార్ బాల్ తెలిపారు. మండలంలోని బ్రాహ్మణ బంజేరుపల్లి గ్రామస్తులను సర్పంచ్ రాములు ఆధ్వర్యంలో గజ్వేల్ సంగాపూర్ సమీపంలోని ఆర్ కాలనీ వారు సందర్శించారు. ఈసందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ముంపు గ్రామాల వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రామస్తులకు 292 ప్లాట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. మల్లన్న సాగర్ కట్ట నిర్మాణం వేగంగా సాగడంతో బంజేరుపల్లి గ్రామస్తులు తమ గ్రామానికి రాకపోకలు ఆగిపోతాయని కొద్ది రోజుల క్రితం వారు పనులు అడ్డుకున్నారు. ఈనేపథ్యంలో  కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ గ్రామస్తులతో కలిసి ఆర్ కాలనీని సందర్శించారు. త్వరలో బ్రాహ్మణ బంజేరుపల్లి గ్రామాన్ని ఖాళీ చేయిస్తామని తహసీల్దార్ తెలిపారు.


logo