శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 30, 2020 , 02:36:10

హరిత తెలంగాణే లక్ష్యం

హరిత తెలంగాణే లక్ష్యం

మద్దూరు:  హరిత తెలంగాణే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జడ్పీ సీఈవో శ్రావణ్ అన్నారు. సోమవారం మద్దూరులో కొనసాగుతున్న హరితహారం కార్యక్రమాన్ని జడ్పీ సీఈవో పర్యవేక్షించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీవో శ్రీనివాసవర్మ, ఈసీ పరశురాములు, సర్పంచ్ జనార్దన్ పాల్గొన్నారు.

నాటిన ప్రతి మొక్కనూ  సంరక్షించుకోవాలి

హుస్నాబాద్: ఆకుపచ్చ తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్క రూ భాగస్వాములు కావాలని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి అన్నారు.   పట్టణంలోని 7, 17వ వార్డు ల్లో మున్సిపల్ చైర్ రజితతో కలిసి   మొక్కలు నాటా రు.  ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్ అనితారెడ్డి, కమిషనర్ రాజమల్లయ్య, కౌన్సిలర్లు చిత్తారి పద్మ,  రాజు  పాల్గొన్నారు. 

ఇంటింటికీ  మొక్కల పంపిణీ..

చేర్యాల : రాష్ర్టాన్ని హరితమయంగా మార్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మున్సిపల్ చైర్  స్వరూపారాణి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో సోమవా రం మున్సిపల్ చైర్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ కలిసి ఇంటింటికీ 3 మొక్కలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి, హరితహారాన్ని విజయవంతం చేయాలని కోరారు. నాటిన మొక్కలను బాధ్యతగా కాపాడినప్పుడు ప్రభుత్వ లక్ష్యం నేరవేరుతుందన్నారు.కార్యక్రమంలో కౌన్సిలర్లు నరేందర్, మంగోలు చంటి, లింగం, సందుల సురేశ్, పచ్చిమడ్ల సతీష్  పాల్గొన్నారు.

మానవ మనుగడకు చెట్లే ఆధారం..

రాయపోల్ : మానవ మనుగడకు చెట్లే ఆధారమని టీఆర్ రాష్ట్ర యువజన నాయకుడు సోలిపేట సతీష్ అన్నా రు.  మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో హరితహారం లో భాగంగా గ్రామ పంచాయతీ ఆవరణలో చెట్లను నాటా రు. ఇంటింటికీ చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు.  గ్రామాల్లో ప్రతి ఒక్క రూ వ్యక్తి గత శుభ్రతను పాటించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ యాదగిరి, ఎంపీపీ  అనిత, మా ర్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, పీఎసీఎస్ వైస్ చైర్మన్ రవీందర్ పాల్గొన్నారు

నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి : ఏసీపీ

కొమురవెల్లి : నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ అన్నారు. సోమవారం మం డలంలోని రసూలాబాద్ 6వ విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా చేర్యాల సీఐ శ్రీనివాస్ ఎస్సై నరేందర్ సర్పంచ్ స్వామిగౌడ్ కలిసి దేవాదుల కెనాల్ ఇరువైపులా మొక్కలు నాటారు.కార్యక్రమంలో ఎంపీడీవో మల్లికార్జున్, వైస్ ఎంపీపీ  రాజేందర్   పాల్గొన్నారు.

ఆకు పచ్చ గ్రామాలే  ప్రభుత్వ లక్ష్యం

మిరుదొడ్డి :  గ్రామాలను ఆకు పచ్చగా మార్చాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం మొక్కలను నాటుతుందని ఎంపీపీ సాయిలు, జడ్పీటీసీ లక్ష్మీ లింగం, పీఏసీఎస్ చైర్మన్ డీసీసీబీ డైరెక్టర్ వెంకటయ్య అన్నారు.  భూంపల్లి, అల్మాజీపూటర్, జంగపల్లి, వీరారెడ్డిపల్లి గ్రామాల్లో మొక్కలను నాటారు. భూంపల్లిలో కేఎస్ హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిం చి, మల్లుపల్లి గ్రామ శివారులో చెరుకు శ్రీనివాస్ ఆధ్వర్యంలో  మొక్కలను నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ మంజూల నర్సింహారెడ్డి, యాదగిరి, వెంకట్ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు  మల్లేశం గౌడ్

ఊరురా హరితహారం

అక్కన్నపేట: హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించుకోవాలని ఎంపీపీ మాలోతు లక్ష్మి  అన్నారు. మ ండలంలోని జనగామ, గుబ్బడి, మోత్కులపల్లి, పెద్దతండా, దుబ్బతండా, చాపగానితండా, పంతుల్ కేశనాయ క్ గ్రామాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యపా ల్ హరితహారం మండల ప్రత్యేకాధికారి పాల్గొన్నారు. 

విజయవంతంగా హరితహారం...

దుబ్బాక: ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రవేశ పెట్టిన హరితహారం  నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి నేతృత్వంలో  విజయవంతంగా కొనసాగుతున్నది.ఐదు రోజులుగా గ్రామా ల్లో మొక్కలు నాటి, కంచెలు ఏర్పాటు చేస్తున్నారు.దుబ్బాక మండలంలో కమ్మర్ చీకోడ్, అచ్చుమాయ పల్ల్లి, పోతారం గ్రామాల్లో మొక్కలు నాటారు. 

పలు గ్రామాల్లో..

హుస్నాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో హరితహారంలో భాగంగా  జిల్లెలగడ్డ గ్రామంలో ఎంపీడీవో అనిత ఆధ్వర్యంలో హరితహారం నిర్వహించారు.  అనం తరం గ్రామంలో పాలకవర్గం సభ్యులు మొక్కలను నాటారు. 

తొగుట: హరితహారం కార్యక్రమంలో భాగంగా తొగుట పోలీస్ స్టేషన్   ఎస్సై శ్రీనివాస్ సిబ్బందితో కలిసి మొక్కలను నాటాడు. 

ప్రతి వార్డును పచ్చగా మారుద్దాం : ఎమ్మెల్యే సోలిపేట

దుబ్బాక టౌన్ : ప్రభుత్వం  నిర్వహిస్తున్న హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతాయని రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. సోమవారం దుబ్బాక మున్సిపాలిటీలోని 15వ వార్డులో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అడవుల శాతాన్ని పెంచాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నారని, ఆ లక్ష్యాన్ని నెరవేర్చే బాధ్యత మనందరిపైనే ఉందని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. హరితహారంలో నియోజకవర్గాన్ని జిల్లాలోనే ఆదర్శంగా నిలుపుదామన్నారు. మున్సిపాలిటీలోని ప్రతి వార్డును పచ్చదనంగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ వనితభూంరెడ్డి, కౌన్సిలర్లు పల్లె మీన,  రాజవ్వ,  కనకయ్య, రైతు బంధు సమితి కో-ఆర్డినేటర్ వంగ బాల్ టీఆర్ నాయకులు రామస్వామిగౌడ్, రొట్టె రమేశ్, మూర్తి శ్రీనివాస్ నందాల శ్రీకాంత్, గోనేపల్లి సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo