మంగళవారం 14 జూలై 2020
Siddipet - Jun 30, 2020 , 02:36:45

రుణాలివ్వండి

రుణాలివ్వండి

చిరు వ్యాపారులను ప్రోత్సహించండి 

పార్కుల అభివృద్ధి జరుగాలి 

బ్యాంకర్లు, అధికారుల  సమీక్షలో మంత్రి హరీశ్‌రావు 

సిద్దిపేట కలెక్టరేట్‌ : ‘రుణ సదుపాయం కల్పించి, చిరు వ్యాపారులను ప్రోత్సహించండి... గజ్వేల్‌లో పార్కులను అభివృద్ధి చేయాలి’ అని మంత్రి తన్నీరు హరీశ్‌రావు బ్యాంకర్లు, అధికారులకు సూచించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ ముజమ్మీల్‌ఖాన్‌, ట్రైనీ కలెక్టర్‌ దీపక్‌ తివారీ, సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ లక్ష్మీప్రసాద్‌, గజ్వేల్‌, దుబ్బాక, హుస్నాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్లు, మెప్మా విభాగం అధికారులతో మంత్రి సమీక్షించారు. పట్టణ పరిధిలో అదనపు టాయిలెట్ల నిర్మాణం, పార్కుల అభివృద్ధి, నూతన పార్కుల ఏర్పాటు, హరితహారం ప్రణాళిక, ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద చిరు వ్యాపారులకు రూ.10 వేల రుణాలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా చేర్యాల 366, హుస్నాబాద్‌ 442, గజ్వేల్‌ 741, దుబ్బాక 550, సిద్దిపేట 2332 మొత్తం 4431 యూనిట్లు ఉండగా 2747 మంది వీధి వ్యాపారులను గుర్తించినట్లు, 1684 మందిని గుర్తించాల్సి ఉందన్నారు.  4 రోజుల్లో ఆన్‌లైన్‌ డాటా పూర్తి చేసి, జూలై 2 లోపు జాబితా సిద్ధం చేయాలన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో 4 పార్కులు చేయాలని, 2వ, 9వ వార్డుల్లో రెండు మియావాకీ - ప్రకృతివనం ఏర్పాటు చేయాలని డీఎఫ్‌వో శ్రీధర్‌ను మంత్రి ఆదేశించారు. గజ్వేల్‌ మున్సిపాలిటీలో పరిధిలో ఒకటి ప్రజ్ఞాపూర్‌ చెరువు వద్ద ప్రకృతివనం, మరొకటి గజ్వేల్‌లో ఉండేలా చూడాలని కమిషనర్‌ కృష్ణారెడ్డికి సూచించారు. సమీక్షలో మున్సిపల్‌ డీఈ లక్ష్మణ్‌, మెప్మా టీఎంసీ సాయికృష్ణ, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

నంగునూరు మండలాభివృద్ధిపై సమీక్ష

గ్రామాలన్నీ శుభ్రంగా ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి సాధించినట్లు అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేటలోని విపంచి ఆడిటోరియంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీడీవో, తహసీల్దార్‌, పంచాయతీ రాజ్‌శాఖ, ఏఈవోలు, కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు. నంగునూరు మండలాభివృద్ధి పనుల పురోగతి, హరితహారం, పశువుల షెడ్ల నిర్మాణం, కల్లాలు తదితర అంశాలపై చర్చించారు. జూలై నెలాఖరులోపు డంపింగ్‌, గ్రేవ్‌ యార్డుల నిర్మాణాలు పూర్తి కావాలన్నారు. సిద్దిపేట బ్రాహ్మణ పరిషత్‌ అభివృద్ధికి రూ.50 లక్షలు సిద్దిపేట బ్రాహ్మణ పరిషత్‌ అభివృద్ధికి రూ.50 లక్షల నిధులు మంజూరైనట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నాటి ఎమ్మెల్యేగా.. నేటి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ దేశంలోనే తొలి బ్రాహ్మణ పరిషత్‌ భవనాన్ని సిద్దిపేటలో ఏర్పాటు చేశారన్నారు. 

తాజావార్తలు


logo