శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 28, 2020 , 01:08:27

పచ్చని పండుగ

పచ్చని పండుగ

  • n కొనసాగుతున్న హరితహారం
  • n మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆరో విడుత హరితహారం జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్నది. పచ్చని పండుగకు పల్లె.. పట్నం కదులుతున్నది. ప్రజాప్రతినిధులతో పాటు అధికారయంత్రాంగం విరివిగా మొక్కలు నాటుతున్నది. సంగారెడ్డిలోని పోలీసు కార్యాలయ ఆవరణలో సిబ్బందితో కలిసి ఎస్పీ చంద్రశేఖర్ సదాశివపేట ఠాణాలో డీఎస్పీ శ్రీధర్ మొక్కలు నాటారు. చేర్యాల ఠాణాలో సీఐ శ్రీనివాస్ ఎస్సై మోహన్ కలిసి 40 మొక్కలను హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ నాటారు. నామునిపల్లి మండలం మల్లికార్జునపల్లిలో సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి మొక్కలు నాటారు. జహీరాబాద్ మండలం బుచినెల్లి, బర్థిపాడు, తూంకుంట గ్రామాల్లో ఎమ్మెల్యే మాణిక్ మొక్కలు నాటి, నీళ్లు పోశారు. - నమస్తే తెలంగాణ నెట్


logo